అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..

అమెరికాలో ఉండే మన భారతీయులు ఏ రేంజ్‌లో ప్యాకేజ్‌లు అందుకుంటారో తెలిసిందే. అంతలా వేతనాలు వస్తాయనే..విదేశాలంటే మోజు మనవాళ్లకు. కానీ ఆ వ్యక్తి కోట్లలో వచ్చే వేతనం కాదనుకుని మరి భారత్‌కి వచ్చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడట.
అంతేగాదు దానికి గల కారణాన్ని వివరిస్తూ..అది సరైనదో కాదో సలహా ఇవ్వండి అంటూ రెడ్డిట్‌లో పోస్ట్‌ పెట్టాడు. అది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..అతడి ఉద్దేశానికి ఫిదా అవ్వతూ ప్రశంసలజల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.


ఇంతకీ కారణం ఏంటేంటే..అమెరికాలో 12 ఏళ్లకు పైగా గడిపిన తర్వాత తిరిగి కుటుంబంతో సహా భారత​ వచ్చేయాలనకుంటున్నట్లు ఓ ఎన్నారై పోస్ట్‌లో తెలిపాడు. ఈ జూన్‌ కల్లా తాము ఐదుగురు ముంబైకి వచ్చేయాలని నిర్ణయించుకున్నామని రెడ్డిట్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. తన వయసు 36 ఏళ్లు అని, 2018లో నవంబర్‌ నుంచి హెచ్‌1బీ విసాతో అమెరికాలో నివశిస్తున్నట్లు తెలిపాడు. పైగా తన వార్షిక ఆదాయం రూ. 2.9 కోట్లు అని, నెట్‌వర్త్‌ వచ్చేసి రుణ రహిత ఇల్లుతో కలిపి దగ్గర దగ్గర రూ. 9 కోట్లు అని వెల్లడించారు.

భారత్‌ తన ఉద్యోగ ఆఫర్‌ ఏడాదికి రూ. 1.5 కోట్ల ప్యాకేజ్‌ అని కూడా వివరించాడు. అయితే తన తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉన్నారని, కుటుబానికి దగ్గరగా ఉండటమే మేలని ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అందులోనూ తన పిల్లలు తాతయ్య నానమ్మల, దగ్గర బంధువులతో పెరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు పోస్ట్‌లో. అక్కడ అమెరికాలో ఇంటి అద్దె చెల్లించకుండా లగ్జరియస్‌గా గడిపినా తన కుటుంబానికి ఈ నిర్ణయం కారణంగా.. చాలా పెద్ద మార్పుని స్వాగతించాల్సి ఉంటుందని అంటున్నాడు.

ఎందుకంటే ముంబైలో అద్దె చెల్లిస్తూ..ఏడాదికి రూ. 1.5 కోట్లతో బతకడం సాధ్యమేనా? అని సందేహం వ్యక్తం చేశాడు. అలాగే యూఎస్‌లో పుట్టి..అక్కడే పెరిగిన పిల్లలు ఇక్కడ జీవనశైలికి, ఎడ్యుకేషన్‌కి సులభంగా అలవాటుపడగలరా, అసలు తన నిర్ణయం సరైనదేనా..? ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని పోస్ట్‌ పెట్టాడు.

అయితే నెటిజన్లు అది మంచి ప్యాకేజీ అని, ముంబైలో ధీమాగా బతకొచ్చు అని అన్నారు. పైగా ఇలా భారత్‌కి రావాలనుకుంటున్న మీ నిర్ణయానికి స్వాగతం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తల్లిదండ్రలు గురించి ఆలోచిస్తున్నందుకు మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.