ఆపరేషన్ సిందూర్ దాటికి పాకిస్తాన్ నిలవలేకపోయింది. ఇన్నాళ్లు మేము గొప్ప మిలిటరీ శక్తిగా భావిస్తూ వచ్చిన పాకిస్తాన్‌కి, భారత్ దాడులు దాని స్థాయి ఎంటో నిరూపించింది. పాకిస్తాన్ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలపై భారత్ దాడులు చేసింది. పాకిస్తాన్ లోని ఎయిర్‌బేస్‌లను భారత్ లక్ష్యంగా చేసుకుని భీకర దాడి చేసింది. అయితే, ఇప్పుడు ఓ సమాచారం పాకిస్తాన్లో వణుకు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ అణు స్థావరాలపై భారత్ బ్రహ్మోస్‌తో దాడులు చేసినట్లు తెలుస్తోంది. బ్రహ్మోస్ ధాటికి పాక్ అణ్వాయుధాల నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్లు సమాచారం. దీని కారణంగా, పాకిస్తాన్ అమెరికా కాళ్లు పట్టుకుని భారత్‌ని కాల్పుల విరమణకు ఒప్పించాలని ప్రాధేయపడినట్లు తెలుస్తోంది.
మే 10 తేదీ శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ లోని మొత్తం 11 ఎయిర్ బేస్‌లని భారత్ కేవలం 90 నిమిషాల్లోనే నాశనం చేసింది. ఈ దాడుల్లో బ్రహ్మోస్ వాడినట్లు తెలుస్తోంది. ఈ ఎయిర్ బేసుల్లో సర్గోదా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సర్గోదాకు సమీపంలోని కిర్నా పర్వతాల్లో పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచిపెడుతుంది. ఈ పర్వతాల్లోనే అనేక సొరంగాల్లో పాక్ వీటిని భద్రపరుస్తుంది. అయితే, ఈ ప్రాంతాల్లో భారత్ దాడి చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో, శనివారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. 4.0 తీవ్రతతో భూప్రంకపనలు రావడం కూడా ఇందుకు అనుమానాలు రేకెత్తిస్తోంది. భారత్ దాడికి ఏదైనా అణ్వాయుధం భూగర్భంలో పేలిందా..? అనే ప్రశ్నలు వెలువడుతున్నా్యి. అణ్వాయుధాలతో భారత్ ని బ్లాక్మెయిల్ చేస్తున్న పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పడానికి ఈ దాడులు చేసిందా అనే చర్చ జరుగుతోంది.
































