అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా నివాసంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్‌లోని ‘మార్ ఎ లాగే’ ఎస్టేట్‌లోకి శనివారం అర్ధరాత్రి సమయంలో ఓ సాయుధ దుండగుడు అడుగుపెట్టడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతని హతమార్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఫ్లోరిడా నివాసంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్‌లోని ‘మార్ ఎ లాగే’ ఎస్టేట్‌లోకి శనివారం అర్ధరాత్రి సమయంలో ఓ సాయుధ దుండగుడు అడుగుపెట్టడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతని హతమార్చారు. ఘటన సమయంలో ట్రంప్, ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్ దంపతులు వైట్‌హౌస్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
20 ఏళ్ల యువకుడు..
ఎస్టేట్ నార్త్ గేట్ నుంచి లోపలకు ప్రవేశించిన అగంతకుడి చేతిలో ఒక ఆయుధం, ఇంధనం క్యాన్ ఉన్నట్టు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుర్తించారు. అతని వయసు 20 ఏళ్లు ఉండవచ్చని, నార్త్ కరోలినా నుంచి వచ్చినట్టు అనుమానిస్తున్నామని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అతని ఆచూకీ, ఏ కారణంతో ట్రంప్ ఎస్టేట్‌లోకి అడుగుపెట్టాడనే కారణాలపై ఎఫ్‌బీఐ, పామ్ బీచ్ కౌంటీ షరీఫ్ కార్యాలయం విచారణ జరుపుతోంది.
కాగా, ట్రంప్‌పై గతంలోనూ హత్యాయత్నం జరిగింది. 2024 జూలై 13న పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రచారం చేస్తుండగా హత్యాయత్నం జరిగింది. స్వల్పగాయంతో ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారు. 2024 సెప్టెంబర్ 15న వెస్ట్ పామ్ బీచ్ వద్ద ట్రంప్ గోల్డ్ కోర్స్ సమీపంలో వేచిచూస్తున్న ఒక సాయుధుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. నిందితుడుకి ఈనెలలోనే యావజ్జీవ జైలుశిక్ష పడింది.




































