ఐఫోన్‌ 16తో పాటు ఆపిల్ లాంచ్‌ చేసిన కొత్త ప్రొడక్ట్స్‌ ఇవే..

www.mannamweb.com


యాపిల్‌ తీసుకొచ్చిన మరో కొత్త ప్రొడక్ట్‌ ఆపిల్ ఎయిర్‌పోడ్స్‌ 4. ఈ ఎయిర్‌పాడ్స్‌లో సిరి ఫీచర్‌ను అందించారు. దీంతో తలను జస్ట్ పైకి కిందికి కదిలించడం ద్వారా కాల్స్‌ లిఫ్ట్‌ చేయొచ్చు అలాగే డిస్‌కనెక్ట్ చేయొచ్చు.

వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 30 గంటల బ్యాటరీ అందిస్తుంది. యాంటీ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను అందించారు. ఇవి వైర్‌లైస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తాయి.

యాపిల్‌ లాంచ్‌ చేసిన మరో ప్రొడక్ట్‌ ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్‌. దీనిలో ఎలాంటి కొత్త ఫీచర్స్‌ జోడించకపోయినప్పటికీ.. కొత్త కలర్స్‌లో వీటిని తీసుకొచ్చారు. మిడ్‌నైట్ బ్లూ, పర్పుల్ ఆరెంజ్, స్టార్‌లైట్ వంటి మూడు కొత్త రంగులను తీసుకొచ్చారు. అలాగే టైప్‌సీ పోర్ట్‌కు సపోర్ట్ చేస్తుంది. సెప్టెంబర్‌ 20 తేదీ నుంచి సేల్స్‌ ప్రారంభంకానున్నాయి.

ఎయిర్‌పాడ్స్‌ ప్రో 2ను కూడా ఆపిల్ కొత్తగా తీసుకొచ్చింది. వీటిని ఆపిల్‌ బధిరుల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసింది. హియరింగ్ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ఇందులో ప్రత్యేంగా అందించారు. చెవిలో సమస్యలు ఉన్నవారికి, పెద్ద శబ్ధాల కారణంగా నొప్పితో బాధపడే వారికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఈ ఎయిర్‌పాడ్స్‌లో చెవి వినికిడి పరీక్ష ఫీచర్‌ను కూడా అందించారు.

మెగా ఈవెంట్‌లో భాగంగా ఆపిల్ వాచ్‌ 10 సిరీస్‌ను లాంచ్‌ చేసింది. ఈ వాచ్‌ ప్రారంభ ధర భారత్‌లో రూ. 46,000గా ఉంది. ఈ వాచ్‌లో ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీ ఇచ్చారు. దీంతో కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇక వాచ్‌లో ఎస్‌10 చిప్‌ ప్రాసెసర్‌ను అందించారు. 100 శాతం కార్బన్‌ న్యూటల్‌ వాచ్‌లా దీనిని డిజైన్‌ చేశారు. ఇక వాచ్‌లో ఎన్నో రకాల హెల్త్‌ ట్రాకర్‌ ఫీచర్లను అందించారు.

ఇక యాపిల్‌ తీసుకొచ్చిన మరో ప్రొడక్ట్‌ ఆపిల్ వాచ్‌ అల్ట్రా 2. ఈ వాచ్‌ను టైటానియంతో రూపొందించారు. స్క్రాచ్‌ రెసిస్టెంట్‌తో ఈ వాచ్‌ను డిజైన్‌ చేశారు. వాచ్ అల్ట్రా 2లోయూయల్ ఫ్రీక్వెన్సీ GPSతో కూడిన అధునాతన పొజిషనింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందించారు. ఇప్పటి వరకు ఏ స్పోర్ట్స్ వాచ్‌లోనూ ఇది లేదు. ఈ వాచ్‌లో ఆటోమేటిక్ స్ట్రోక్ డిటెక్షన్, ల్యాప్ కౌంట్స్ వంటి ఫీచర్లను అందించారు. సెప్టెంబర్‌ 20వ తేదీ నుంచి అమెరికాలో ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.