ప్రముఖ వక్కపొడి సంస్థలో ఐటీ అధికారులు(IT Rides) దాడులు చేశారు. ఈ దాడుల్లో కేజీల కొద్దీ బంగారం, వెండితోపాటు కోట్ల కొద్ది డబ్బు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
ప్రముఖ వక్కపొడి క్రేన్ సంస్థ(Crane Vakkapodi Companies)కు చెందిన తెలంగాణ(Telangana), ఏపీ(AP)ల్లోని కార్యాలయపై బుధవారం ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేతకు సంబంధించిన సమాచారంతో గత రెండు రోజులుగా గుంటూరు, విజయవాడలో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు.. నేడు హైదరాబాద్ లోని ఆ సంస్థ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పన్నులో లెక్కలు చూపని 40 కేజీల బంగారం, 100 కేజీల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా కోట్ల కొద్ది నగదును కూడా సీజ్ చేసినట్టు సమాచారం. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతునట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.