ముంచుకొస్తున్న జూలై.. భయంతో వణికిపోతున్న జపాన్‌ ప్రజలు!

జపాన్‌కు చెందిన మాంగా కళాకారిణి రియో టాట్సుకి 2025 జూలై 5న భారీ విపత్తు సంభవిస్తుందని అంచనా వేసింది. నగరాలు మునిగిపోవడం, సునామీ వంటివి ఆమె అంచనాలలో ఉన్నాయి. ఈ అంచనాల వల్ల జపాన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రభుత్వం ప్రశాంతంగా ఉండమని కోరినప్పటికీ, పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది

జపాన్‌ను ఓ భారీ విపత్తు ముంచెత్తనుందని జపాన్‌కు చెందిన మాంగా కళాకారిణి, న్యూ బాబా వంగా అని పేరొందిన రియో ​​టాట్సుకి అంచనా వేసింది. అది కూడా డేట్‌తో సహా విపత్తు గురించి చెప్పింది. జూలై 5, 2025న జపాన్‌ను ముంచెత్తే భారీ విపత్తు గురించి ఈ కార్టూన్‌ క్యారెక్టర్‌ అంచనా వేయడంతో ప్రస్తుతం జపాన్‌లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. జూలై 5వ తేదీ దగ్గరికి వస్తుండటంతో ఏం జరగబోతుందో అని ప్రజలంతా భయపడుతున్నారు. ఓ కార్టూన్‌ క్యారెక్టర్‌ అంచనా వేస్తే ఇంత భయపడాలా అంటూ.. గతంలో ఆ క్యారెక్టర్‌ చెప్పిన చాలా విషయాలు జరిగాయి. అందుకే అక్కడి వారు రియోటాట్సుకి అంచనాలను బలంగా నమ్ముతారు.


జూలై 5న ఏం జరగబోతోంది?

“ది ఫ్యూచర్ ఐ సా” పుస్తకం ప్రకారం.. జూలై 5, 2025న జపాన్‌లో ఒక విపత్తు సంభవిస్తుందని, దాని ఫలితంగా నగరాలు సముద్రంలో మునిగిపోతాయని రియో ​​టాట్సుకి అంచనా వేసింది. నీటి అడుగున పేలుడు లేదా అగ్నిపర్వత విస్ఫోటనం గురించి ఈ అంచనా సూచిస్తుంది. ఆమె దృష్టిలో మరిగే సముద్రాలు, భారీ బుడగలు, 2011 టోహోకు భూకంపం కంటే శక్తివంతమైన అలలు ఉన్నాయి. ఇది దక్షిణ జపాన్, సమీప ప్రాంతాలను తాకే మెగా-సునామీ వచ్చే అవకాశం ఉందని సూచిస్తుంది.

ఆమె భయంకరమైన అంచనా పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. జూన్ చివరి నుండి జూలై ప్రారంభం వరకు హాంకాంగ్ నుండి జపాన్‌కు విమాన బుకింగ్‌లు 83 శాతం తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రజలు భయపడుతున్నారు, జపాన్‌కు ప్రయాణాలు ప్లాన్ చేసుకున్న చాలా మంది ఇప్పుడు రద్దు చేసుకుంటున్నారు, రియో చెప్పినట్లు జరగకపోయినా భయంకరమైనది ఏదైనా జరగవచ్చు అనే భయంతో ప్రజలు జపాన్‌లో పర్యటించేందుకు భయపడుతున్నారు. ట్రావెల్ ఏజెన్సీలు, విమానయాన సంస్థలపై కూడా దీని ప్రభావం పడింది. కొంతమంది ప్రయాణికులు సంభావ్య విపత్తు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని, వారు రిస్క్ తీసుకోవడం కంటే సురక్షితంగా ఉండటానికి ఇష్టపడతారని అంటున్నారు.

జపాన్ అధికారులు ఏమంటున్నారు?

జపాన్ అధికారులు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నివేదికల ప్రకారం.. మియాగి గవర్నర్ యోషిహిరో మురై పౌరులు, ప్రయాణికులు భయపడవద్దని విజ్ఞప్తి చేశారు. విపత్తుపై అధికారిక హెచ్చరిక లేదని, కేవలం పుకార్ల ఆధారంగా ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకోవద్దని ఆయన కోరారు. పర్యాటక పరిశ్రమ పెద్దగా నష్టపోకూడదని, జూలై ఎటువంటి సంఘటనలు లేకుండా గడిచిపోతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

రియో టాట్సుకి గత అంచనాలు

రియో టాట్సుకి అంచనాలు వేయడం కొత్త కాదు. ఆమె ఇంతకుముందు వేసిన అంచనాలను ఒకసారి పరిశీలిస్తే.. 2011 టోక్యూ భూకంపం, ప్రిన్సెస్ డయానా, ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణాలు, కోవిడ్-19 మహమ్మారి వంటివి రియో ముందే అంచనా వేసింది. 2030లో కొత్త వైరస్ వేరియంట్ కనిపించే అవకాశం ఉందని కూడా ఆమె హెచ్చరించింది. ఇది మరింత ప్రమాదకరమైనది కావచ్చు అని ఆమె చెప్పింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.