రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. నాగ్అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు కల్కి 2898 ఏడీ సీక్వెల్‌పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
కల్కి వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే సీక్వెల్‌కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కల్కి సీక్వెల్ షూటింగ్ 60 శాతం పూర్తయ్యిందని మేకర్స్ తెలిపారు. అలాగే ఈ కోసం చాలా ఏళ్లు సమయం అవసరం లేదని చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపాడు. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. రెండో భాగం త్వరలో విడుదల కానుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
‘కల్కి 2898 AD’ జూన్ 27న విడుదలయ్యింది.. ఈ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మొదటి భాగానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. అయితే రెండో భాగానికి ఎక్కువ సమయం పట్టదని నాగ్ అశ్విన్ తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. కల్కి రెండో భాగానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మొదటి భాగం షూటింగ్ జరుగుతుండగా, రెండో భాగానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాం. దాదాపు 20 రోజుల షూటింగ్ పూర్తయింది. ఇంకా చాలా ఆలోచించి చేయాల్సిన పని ఉంది. ఈ మొదటి భాగానికి పట్టినంత సమయం తీసుకోదు’ అని అన్నారు.
దాంతో ఈ అనుకున్న దానికంటే ముందే విడుదలవుతుందని టాక్ వినిపిస్తుంది. ‘కల్కి 2898 AD’ చిత్రాన్ని ఫిబ్రవరి 2020 నెలలో ప్రకటించారు. నాలుగేళ్ల తర్వాత దర్శకుడు ను విడుదల చేశారు. ఇప్పుడు ‘కల్కి2’ కనీసం మరో రెండేళ్లలో అయినా పడుతుందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సహాన్ని తెచ్చిపెట్టాయి.