జోరుగా సాగుతున్న కోడి పందాలు.. గెలిచిన వారికి లక్షల విలువ చేసే గిఫ్ట్!

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. సంక్రాంతి (Sankranti) పండుగ సమయంలో ఏపీలో (Andhra Pradesh) కోడి పందాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం జోరుగా కోడి పందాలు జరుగుతున్నాయి. ఉభయ గోదావరి (Ubaya Godavari Districts) జిల్లాలతో పాటు కృష్ణా, విజయవాడ జిల్లాలలో ఎక్కువగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. చిన్న స్టేడియాలను (Stadium) తయారు చేసినట్లు వీటికి కోడి పందాలకు సెటప్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. సంక్రాంతి (Sankranti) పండుగ సమయంలో ఏపీలో (Andhra Pradesh) కోడి పందాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం జోరుగా కోడి పందాలు జరుగుతున్నాయి. ఉభయ గోదావరి (Ubaya Godavari Districts) జిల్లాలతో పాటు కృష్ణా, విజయవాడ జిల్లాలలో ఎక్కువగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. చిన్న స్టేడియాలను (Stadium) తయారు చేసినట్లు వీటికి కోడి పందాలకు సెటప్ చేశారు. పెద్ద స్క్రీన్లు, ఎల్‌ఈడీ లైట్లు (LED Lights) అన్ని పెట్టుకుని కోడి పందాల ప్రీమియర్ లీగ్‌లు అంటుూ సెట్ చేస్తున్నారు. ఈ కోడి పందాలకు ఎందరో వస్తుంటారు. కోట్లలో బిజినెస్ (Business) జరుగుతుంది. ఒక్కో రౌండ్‌కి లక్షలు, కోట్లలో కూడా పందాలు వేస్తుంటారు. ఒక రౌండ్‌లో ఓడిపోయిన కూడా ఇంకో రౌండ్‌లో గెలుస్తారని ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. ఈ కోడి పందాల్లో గెలిచిన వారికి గిఫ్ట్‌లు కూడా ఇస్తుంటారు. అయితే ఈ క్రమంలో కాకినాడ రూరల్ పెనుగుదురులో కోడి పందాల్లో గెలిచిన వారికి రూ.25 లక్షల మహేంద్ర థార్‌ను బహుమతిగా కూడా ఇవ్వనున్నారు. ఈ గిఫ్ట్‌తో బరిలో దిగే వారి సంఖ్య పెరిగిపోతుంది.

ఏపీలో మూడు రోజులు పాటు పగలు, రాత్రి కోడి పందెలు జరుగుతుంటాయి. వీటిలో ఖరీదైన బైక్‌లు, కార్‌లు వంటివి కూడా గిఫ్ట్‌లు ఇస్తుంటారు. ఈ కోడి పందాలను చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా చూస్తుంటారు. ఇవి ఎందరినో ఆకర్షిస్తాయి. కొందరు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీటిని చూడటానికి వస్తుంటారు. వీటిని చూడటానికి వచ్చే వారికి భోజనాలు, వసతి సదుపాయాలు అన్ని కూడా ఉంటాయి. ఇలా కొత్త కొత్త గిఫ్ట్‌లు కూడా వారికి అందజేస్తుంటారు. అలాగే ఈ పందాలు జరిగే దగ్గర ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. సంక్రాంతి పండుగ మొదటి రోజే కోట్లలో బిజినెస్ జరుగుతుంటుంది. కేవలం కోడి పందాలు అనే కాకుండా పేకాట వంటివి కూడా జరుగుతుంటాయి. రాత్రి పగలు అని తేడా లేకుండా పూర్తిగా ఇవే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కేవలం పండుగ మూడు రోజులు మాత్రమే ఇవి జరుగుతుంటాయి. కేవలం పెద్దవారు మాత్రమే కాకుండా చిన్న పిల్లలు కూడా ఈ కోడి పందాలు వేస్తుంటారు. ఈ కోళ్లను ముందు నుంచే రెడీ చేస్తారు. వీటికి మంచిగా ఫుడ్ పెట్టి, అవి పందెంలో గెలిచేలా చేస్తారు. నిజానికి వాటికి బాగా పోషకాలు ఉండే ఫుడ్ పెడుతుంటారు. వీటిని పెట్టడం వల్ల అవి పందాల్లో గెలుస్తాయని నమ్ముతారు.