Kumari Aunty : కుమారి ఆంటీ క్రేజే వేరు.. నెలకు రూ. 18 లక్షలు..!

www.mannamweb.com


Kumari Aunty : హైదరాబాద్‌లో చార్మినార్ ఎంత ఫెమస్సో.. ధమ్ బిర్యానీ కుడా అంతే. స్ట్రీట్‌ఫుడ్‌కు భాగ్యనగరం పెట్టింది పేరు. ఎక్కడ ఏ ఫుడ్ ఉన్నా సోషల్ మీడియా పుణ్యాన ఇట్టే తెలిసిపోతుంది.
మీరు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ యూజర్లు అయితే.. ఏది ఓపెన్ చేసినా కుమారి ఆంటీ ప్రత్యక్షమైపోతుంది. రీల్స్‌లో తెగ వైరల్ అవుతుంది. నాన్న.. ఏం కావాలి. చికెన్ అయితే 120.. లివర్ అయితే 150 అంటూ ప్రేమగా మాట్లాడుతూ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌లో దూసుకుపోతుంది. ప్రపంచంలోనే ఏదైనా బాగా సక్సెస్ అయ్యే బిజినెస్ చెప్పమంటే ఆలోచన చేయకుండా టక్కున చెప్పొచ్చు అది ఫుడ్ బిజినెస్ అని. కాబట్టి అటువంటి బిజినెస్‌నే ఎంచుకుంది మన కుమారి ఆంటీ.. ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడకు చెందిన (దాసరి సాయి కుమారి)కుమారి ఆంటీ 2011 లో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఐటీసీ కోహినూర్ ఎదురుగా స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్ ప్రారంభించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 ఏళ్లుగా ఇదే బిజినెస్ రన్ చేస్తూ అందరూ కూడా అవాక్కయేలా చేస్తుంది కూమారి ఆంటి. కేవలం 5 కేజీల రైస్‌తో మొదలు పెట్టిన ఆమె వ్యాపారం ఇప్పుడు 100 కేజీల రైస్ వండే వరకు విస్తరించింది.
ఇక ఈరోజుల్లో సోషల్ మీడియా ఫుడ్ బ్లాగ్స్ ఎంత పెద్ద సక్సెస్ అవుతున్నాయో పెద్దగా చెప్పక్కర్లేదు. అలా కొందరి యూటుబర్స్ పుణ్యమా అంటూ.. కుమారి ఆంటీ ప్రజలకు పరిచయమైంది. తక్కువ ప్రైస్‌లో మంచి ఫుడ్ పెడుతుందని, టేస్ట్ బావుంటుందని సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ కావడంతో కుమారి ఆంటీ బండి దగ్గరికి కుర్రకారు క్యూ కట్టారు. ఆ తర్వాత సెలబ్రిటీలు సైతం తమ వ్యూస్ పెంచుకోవడానికి కుమారి ఆంటీతో ఇంటర్వ్యూలు చేయడం స్టార్ట్ చేశారు. అలా కుమారి ఆంటి ఓ ఇంటర్య్యూలో ఆమె చెప్పిన ఆదాయం చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లోని మన ఐటి ఉద్యోగులకైతే దిమ్మతిరగి మైండ్ బ్లాక్ అయ్యింది.

సాధారణంగా ఫుడ్ బిజినెస్ అయితే ఎంత వస్తుంది ఆదాయం. మహా అయితే నెలకు లక్ష రావచ్చు అనుకుంటాం. కానీ మన కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ మీద ఎంత సంపాదిస్తుందో తెలుసా..? అక్షరాల ర.18 లక్షలు. ఏంటీ షాక్ అయ్యారా.. జోక్ అనుకుంటున్నారా..? కాదు గురూ ఇదే నిజం. ఆమె రోజుకు రూ. 60 వేలు సంపాదిస్తుంది. నెలకు రూ.18 లక్షలు.. ఈ విషయం స్వయంగా ఆమె నోటితో మన కుమారి ఆంటీనే చెప్పింది. నాన్‌వెజ్ రెండు కర్రీలు తీసుకుంటే ప్లేటు రూ.150, మూడు తీసుకుంటే 200 అలా ఐటమ్‌ను బట్టి రేటు ఉంటుంది. రోజుకు 700 మంది కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తింటారట. యావరేజ్‌గా 600 మంది కస్టమర్స్‌కు 100 రూపాల లెక్కవేసుకున్నా.. రోజుకు 60,000 వేలు వస్తాయిని తెలిపింది. పెట్టుబడి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు పోయినా.. 6 లక్షలు లాభమన్న మాట. ఈ లెక్కలు విన్న మన ఐటీ ఉద్యోగులు, ఇతర వ్యాపారులు ,ఉద్యోగస్తులైతే.. తూ దీనెమ్మ బతుకు తొక్కలో ఉద్యోగం.. అర్జెంట్‌గా మనము ఓ ఫుడ్ బండి పెట్టాయ్యాలని సరదాగా పోస్టులు పెట్టుకుంటున్నారట.

కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలై 3 గంటలకు క్లోజ్ అవుతుంది. నాన్‌వెజ్‌లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ కర్రీ,మటన్ హెడ్, ఫిష్ ఫ్రై, ఫిష్
కర్రీ వంటి రకాలు ఉన్నాయి. వెజ్‌లో అయితే వైట్ రైస్, బగారా రైస్, టమాటా రైస్, గోంగూర రైస్, జీరా రైస్, లెమర్ రైస్, పెరుగన్నం వంటి ఐటమ్స్ ఉన్నాయి. ఇక కుమారి ఆంటీ రేంజ్ అయితే సెలబ్రిటీగా మారిపోయింది. ఎక్కడ కనిపించినా ఫోటోలు దిగుతున్నారు. మరి కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ టేస్ట్ చేయాలంటే..పైసలు ఫుల్‌గా పెట్టుకొని వెళ్లి రండమ్మా.. రెండు లివర్స్ 1000 రూపాయలే కదా..!