నిన్న ఉత్తర అంతర్గత కర్నాటకపై గల ఉపరితల ఆవర్తనం ఇప్పుడు రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సగటు సముద్రమట్టానికి 0.9 కి. మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ వరకు రాయలసీమ – పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం నుండి తమిళనాడు.. కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది.. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
బుధవారం: తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:- సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
రాయలసీమ:- సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.