Lord Krishna: శ్రీ కృష్ణుడికి నిజంగా 16 వేల మంది భార్యలా..? అసలు నిజం ఏంటో తెలుసా

Lord Krishna: శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది భార్యలా…? అన్ని వేల మందిని కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడా..? అంత మందిని ఆయన ఎలా పెళ్లి చేసుకున్నారు. అసలు అంత మందిని ఆయన పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. కృష్ణుడు నిజంగానే అంత మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడా..? లేకపోతే ఏదో మాట వరసకు అలా అంటున్నారా..? ఇలాంటి ఆసక్తకరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


హిందూ పురాణాలైన భాగవతం చదివితే శ్రీకృష్ణుడి రూపం తెలుస్తుంది. భారతం చదివితే కృష్ణుడి విశ్వరూపం తెలుస్తుంది. యుద్దం చేయనని మొండికేసిన అర్జునుడి కోసం చేసిన భగవద్గీతను చదివితే శ్రీకృష్ణుడి వ్యక్తిత్వాన్ని ఆయన లోకానికి దారి చూపిన విధానాన్ని తెలుసుకోవచ్చు… అవతార పురుషుడిగా ద్వాపరయుగంలో ధర్మ స్థాపన కోసం పుట్టుకొచ్చిన శ్రీమన్నారాయణుడిగా శ్రీకృష్ణుడిని హిందువులు కొలుస్తుంటారు. సత్యం, సహనం శీలతగా తన జీవితాన్నే సమాజానికి ఒక పాఠంగా పరిచయం చేసిన శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఉన్నారని పురాణాలలో ప్రశక్తి.. అదే విషయాన్ని చాలా మంది చెప్తుంటారు కూడా.. పదహారువేల మంది గోపికలతో ఆయన సరససల్లాపాలు సాగించారని కొంత మంది అటుంటారు.

అయితే నిజంగా కృష్ణుడు పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్నాడా..? అంటే చేసుకున్నాడనే చెప్తున్నారు పండితులు. పూర్వ నరకాసురుడు అనే రాక్షసుడు తనకు వరం ఉందన్న మధంతో రాజ్యాల మీద పడి దాడులు చేస్తూ… ఆయా రాజులను ఓడిస్తూ.. వారి కుమార్తెలను చెర బట్టేవాడట. అలా నరకాసురుడు పదహారు వేల ఒక వంది మంది రాజ కుమార్తెలను బంధించాడట. తర్వాత సత్యభామ సమేతంగా నరకాసురుడిని శ్రీకృష్ణుడు యుద్దంలో చంపేస్తారు. నరకాసురుడు చనిపోయిన తర్వాత ఆ రాక్షసుడి దగ్గర బంధీలుగా ఉన్న పదహారు వేల ఒక వంద మంది మహిళలకు విముక్తి లభించిందట. అయితే ఆ మహిళలందరూ కృష్ణుడి దగ్గరకు వెళ్లి తమకు విముక్తి ప్రసాదించినందుకు కృతజ్ఞతలు స్వామి కానీ ఇప్పుడు మా భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదని మొరపెట్టుకున్నారట.

అదేంటి ఒక రాక్షసుడి భారి నుంచి వాడు పెడుతున్న బాధలను నుంచి మీకు విముక్తి కల్పిస్తే.. ఇంకా భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారని శ్రీకృష్ణుడు అడిగాడట. దీంతో ఆ పదహారు వేల మంది కన్యలు తాము ఇన్ని రోజులు నరకాసురడి చెరలో బంధీలుగా ఉన్నాము… ఇప్పుడు బయట మమ్మల్ని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు.. పెళ్లి కానీ జీవితాల వ్యర్థమే కదా స్వామి అని చెప్పుకున్నారట. అలాగే పరాయి పురుషుడి నీడలో ఉన్న మమ్మల్ని సమాజంలో ఒక్కో రకంగా చూస్తారు మాకు ఇక ఆత్మహత్య చేసుకోవడం మిగిలి ఉన్న దారి అని చెప్పారట.

దీంతో శ్రీకృష్ణనుడు మీకు సమాజంలో మంచి గౌరవం, హోదా నేను కల్పిస్తాను.. మిమ్మల్ని అందరినీ నేను పెళ్లి చేసుకుంటాను.. మీకు నా భార్యలు అనే హోదా ఇస్తాను.. అంటూ వారిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడట. అయితే వారికి సమాజంలో హోదా ఇవ్వడానికి మాత్రమే కృష్ణుడు వారిని పెళ్లి చేసుకున్నాడు కానీ ఏనాడు ఆయన వాళ్లతో ఫిజికల్‌ రిలేషన్‌ పెట్టుకోలేదని.. కృష్ణుడు ఎప్పుడైనా స్త్రీ రక్షకుడే తప్ప స్త్రీ లోలుడు కాదని పండితలు చెప్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.