కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రజనీకాంత్-కమల్ హాసన్ తర్వాత, అత్యధిక అభిమానులను కలిగి ఉన్న రెండవ తరం స్టార్ నటులలో అజిత్ కూడా ఒకరు.
కేవలం తమిళనాటే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ స్టార్ హీరోకు భారీగా అభిమానులు ఉన్నారు. అయితే అజిత్ తన సహ నటుల కంటే చాలా భిన్నంగా ఉంటాడు. ముఖ్యంగా తన ప్రపంచం చాలా వేరు. లు చేస్తూనే తనకు ఇష్టమైన బైక్ రైడింగ్ చేస్తూ లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. దేశ విదేశాల్లో చాలా సార్లు బైక్ రైడింగ్ చేశాడు అజిత్. ఈ స్టార్ హీరో గ్యారేజీలో ప్రపంచంలోనే అత్యుత్తమ రేసింగ్ బైక్ లు ఉన్నాయి. అంతే కాకుండా అజిత్‌కి కార్లంటే ప్రత్యేక ప్రేమ. అతని వద్ద చాలా అద్భుతమైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు అజిత్ గ్యారేజీలోకి మరొక కొత్త కారు వచ్చి చేరింది. తాజాగా ఎరుపు రంగు ఫెరారీ కారును కొనుగోలు చేశాడీ స్టార్ హీరో. ఈ లగ్జరీ కారు ధర దాదాపు 9 కోట్ల రూపాయలు. ఈ సందర్భంగా అజిత్ తన కొత్త కారు పక్కన కూర్చొని ఫొటోలకు పోజులిచ్చాడు. వీటిని అజిత్ అభిమానులు తమ సోషల్ నెట్వర్కింగ్ ఖాతాల్లో షేర్ చేస్తున్నారు.
ఫీచర్లు ఇవే..
అజిత్ ఫెరారీ SF90 మోడల్ కారును కొనుగోలు చేశాడు. భారతదేశంలో దీని ధర 9 కోట్గాలు ఉంటుంది. ఇది 3990 cc అత్యంత శక్తివంతమైన కారు. ఈ కారు కొన్ని సెకన్లలో గంటకు 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఈ కారులో అనేక అధునాతన సాంకేతికతలు కూడా ఉన్నాయి. SF90 కారులో అత్యుత్తమ సేఫ్టీ టెక్నాలజీ కూడా ఉంది. కాగా అజిత్ కుమార్ వద్ద 34 కోట్ల విలువైన లాంబోర్గినీ కారు కూడా ఉంది. ఇది కాకుండా ల్యాండ్ రోవర్ డిస్కవరీ, మెర్సిడెస్ మేబ్యాక్, బిఎమ్‌డబ్ల్యూ తదితర లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటితోపాటు 24 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 1000ఆర్ఆర్ బైక్, 20 లక్షల విలువైన అప్రిలియా కపోనార్డ్ బైక్, 21 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ కె1300, 19 లక్షల విలువైన కవాసకి నింజా బైక్స్ ఉన్నాయి.
ఇక ల విషయానికి వస్తే.. అజిత్ కుమార్ ప్రస్తుతం ‘విడ మయూర్చి’ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత ‘గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ’ లో నటించనున్నాడు. ఈ రెండు ల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ లో నటించనున్నాడు. ఆ తర్వాత నటుడు యశ్‌తో కలిసి అజిత్ ‘కేజీఎఫ్ 3’ చిత్రంలో నటించనున్నాడు.