స్కూల్లో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కొడుకు మార్క్‌ శంకర్‌

పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ చదువుతున్న సింగపూర్‌లోని స్కూలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.


ఈ ఘటనలో ఏపీ డిప్యూటీ సీఎం కుమారుడు మార్క్‌ శంకర్‌ చిక్కుకున్నాడు. కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌ అల్లూరి పర్యటనలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన వెంటనే సింగపూర్‌ బయలుదేరనున్నారు.

సింగపూర్‌లోని మార్క్‌ శంకర్‌ చదువుతున్న స్కూల్లో జరిగింది ఈ అగ్ని ప్రమాదం. ఘటనలో మార్క్‌ శంకర్‌ చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంలో తో పాటు ఊపిరితిత్తుల్లోకి కూడా పొగ చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే అడవి తల్లి బాటలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఆయన బుధవారం కూడా స్టీల్ ప్లాంట్ సందర్శించాల్సి ఉంది. కాగా ఈలోగా కుమారుడికి ప్రమాదం జరగడంతో ఆయన అల్లూరి పర్యటన అనంతరం వెంటనే సింగపూర్ ప్రయాణించనున్నారు.

అక్కడి నుంచి పవన్‌ హాస్పిటల్‌కు చేరుకోనున్నారు. మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా పిల్లులు పరిగెత్తారు. ఈ సమయంలో మార్క్‌ శంకర్‌తోపాటు పలువురు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పవన్‌ కల్యాణ్‌ రెండో కుమారుడి పూర్తి పేరు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన పవన్ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గత రాత్రి స్కూల్లో చదువుతున్న సమయంలో షాక్‌ సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ప్రస్తుతం మార్క్‌ శంకర్‌తోపాటు అన్నా లెజినోవా ఉన్నారు. మన్నెం నుంచి విశాఖకు చేరుకుంటున్నారు పవన్‌, అక్కడి నుంచి నేరుగా స్పెషల్‌ ఫ్లైట్‌లో సింగపూర్‌కు చేరుకోన్నారు.

ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సైతం పవన్‌ కల్యాణ్‌కు కాల్‌ చేసి ఆరా తీశారు. ఇరు రాష్ట్రాల మంత్రులు కూడా పరిస్థితిని ఆరా తీసి తెలుసుకుంటున్నారు. ఢిల్లీ నుంచి కూడా నేతలు పవన్‌ కల్యాణ్‌ కొడుకు ఘటనపై పరామర్శించారు. తన పర్యాటన పూర్తిగా ముగించుకున్న తర్వాతే పవన్‌ సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్‌ నుంచి స్పెషల్‌ ఫ్లైట్‌ విశాఖకు వెళ్లనుంది అక్కడి నుంచి ఆయన హుటాహుటిన సింగపూర్‌ వెళ్తారు