ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజీలలో మధ్యాహ్న భోజనం

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం(State Govt) గుడ్ న్యూస్ అందించింది. త్వరలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం(Mid-day meal plan) అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇందులో భాగంగా.. జనవరి 1 నుంచి దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. కాగా దీని ద్వారా దాదాపు 1.20 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది. ఈ నెల 19-12-2024 న(గురువారం) జరిగే కేబినెట్ సమావేశంలో ఇంటర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం పథకానికి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది.