దిల్లీ: భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీకి మరోసారి రోడ్లు, రవాణా శాఖ కేటాయించారు. మోదీ 2.0లో విదేశీ వ్యవహారాల బాధ్యతలను చేపట్టిన జై శంకర్‌కు మళ్లీ అదే శాఖ బాధ్యతలను అప్పగించారు. ఆర్థిక శాఖ బాధ్యతలను మళ్లీ నిర్మలమ్మకే ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ నాయుడికి పౌరవిమానయాన బాధ్యతలు అప్పగించారు. పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ (సహాయ), భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ) కేటాయించారు. ఇక తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు.. బండి సంజయ్ కుమార్ హోంశాఖ (సహాయ) మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. ప్రధాని మోదీతో పాటు ఆదివారం 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా.. 36 మంది సహాయ మంత్రులుగా, ఐదుగురు స్వత్రంత్ర మంత్రులు ఉన్నారు. వీరికి తాజాగా కేటాయింపులు జరిపారు.
ఇతర మంత్రుల శాఖలు ఇవే..
- 1. రాజ్‌నాథ్ సింగ్ (భాజపా)- రక్షణ శాఖ
- 2. అమిత్ షా (భాజపా)- హోం మంత్రిత్వ, సహకార శాఖ
- 3. నితిన్ గడ్కరీ (భాజపా)- రోడ్లు, జాతీయ రహదారులు
- 4. జగత్ ప్రకాశ్ నడ్డా (భాజపా)- ఆరోగ్య, సంక్షేమం; రసాయనాలు, ఎరువులు
- 5. శివరాజ్ సింగ్ చౌహాన్ (కొత్త) (భాజపా)- వ్యవసాయం, రైతు సంక్షేమం; గ్రామీణాభివృద్ధి
- 6. నిర్మలా సీతారామన్ (భాజపా)- ఆర్థికం; కార్పొరేట్ వ్యవహారాలు
- 7. సుబ్రహ్మణ్యం జైశంకర్ (భాజపా)- విదేశీ వ్యవహారాలు
- 8. మనోహర్ లాల్ ఖట్టర్ (కొత్త) (భాజపా)- గృహనిర్మాణ, పట్టణభివృద్ధి; విద్యుత్తు
- 9. హెచ్.డి. కుమారస్వామి (కొత్త) (జేడీఎస్)- భారీ పరిశ్రమలు, ఉక్కు
- 10. పీయూష్ వేద్ ప్రకాశ్ గోయల్ (భాజపా)- వాణిజ్య, పరిశ్రమలు
- II. ధర్మేంద్ర ప్రధాన్ (భాజపా) – విద్య
- 12. జీతన్ రామ్ మాంఝి (కొత్త) (హెచ్ఎఎం) – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
- 13. రాజీవ్ రంజన్ (లలన్)సింగ్ (కొత్త) (జేడీయూ) – పంచాయతీరాజ్; మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ
- 14. సర్బానంద్ సోనోవాల్ (భాజపా)- షిప్పింగ్, పోర్టులు, వాటర్ వేస్
- 15. వీరేంద్ర కుమార్ (భాజపా)- సామాజిక న్యాయం, సాధికారత
- 16. కింజరాపు రామ్మోహన్ నాయుడు (కొత్త) (తెదేపా) – పౌర విమానయానం
- 17. ప్రహ్లాద్ వెంకటేష్ జోషి (భాజపా) – వినియోగదారుల వ్యవహారాలు; ఆహార, ప్రజాపంపిణీ; నూతన, పునరుత్పాదక ఇంధనం
- 18. జుయెల్ ఓరం (కొత్త) (భాజపా) – గిరిజన వ్యవహారాలు
- 19. గిరిరాజ్ సింగ్ (భాజపా) – జౌళి పరిశ్రమ
- 20. అశ్వినీ వైష్ణవ్ (భాజపా) – రైల్వే, సమాచార – ప్రసారాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్
- 21. జ్యోతిరాదిత్య సింధియా (భాజపా) – కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
- 22. భూపేంద్ర యాదవ్ (భాజపా) – పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు
- 23. గజేంద్రసింగ్ షెకావత్ (భాజపా)- పర్యటక, సాంస్కృతికం
- 24. అన్నపూర్ణాదేవి (కొత్త) (భాజపా) – మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
- 25. కిరణ్ రిజిజు (భాజపా) – పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు
- 26. హర్దీప్ సింగ్ పూరి (భాజపా) – పెట్రోలియం, సహజవాయువులు
- 27. మనస్సుఖ్ ఎల్. మాండవీయ (భాజపా) – కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు – యువజన వ్యవహారాలు
- 28. గంగాపురం కిషన్ రెడ్డి (భాజపా) – బొగ్గు, గనులు
- 29. చిరాగ్ పాసవాన్ (కొత్త) (ఎలేపీ- పాసవాన్) – ఆహార శుద్ధి పరిశ్రమలు
- 30. సి.ఆర్.పాటిల్ (కొత్త) (భాజపా)- జల్ శక్తి
సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)..
- 31. రావ్ ఇంద్రజిత్ సింగ్ (భాజపా) – గణాంకాలు, కార్యక్రమాల అమలు, సాంస్కృతిక
- 32. జితేంద్రసింగ్ (భాజపా)- శాస్త్ర సాంకేతిక,, భౌగోళిక శాస్త్ర, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది వ్యహారాలు, పించన్లు, అణు ఇంధనం, అంతరిక్షం
- 33. అర్జున్ రామ్ మేఘ్ వాల్ (భాజపా)- న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాలు
- 34. ప్రతాప్ రావ్ గణపత్‌రావ్ జాదవ్ (కొత్త) (శివసేన)- ఆయుష్, ఆరోగ్య – కుటుంబ సంక్షేమం
- 35. జయంత్ చౌధరి (కొత్త) (ఆర్ఎల్డీ)- నైపుణ్యాభివృద్ధి, ఆంత్రపెన్యూర్, విద్య
సహాయ మంత్రులు
- 36. జితిన్ ప్రసాద (కొత్త) (భాజపా) – వాణిజ్య, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్
- 37. శ్రీపాద్ యశో నాయక్ (భాజపా) – విద్యుత్తు, కొత్త పునరుత్పాక ఇంధనం
- 38. పంకజ్ చౌధరి (భాజపా) – ఆర్థికం
- 39. క్రిషన్ పాల్ (భాజపా) – సహకారం
- 40. రామ్ దాస్ అఠావలె (ఆర్ పీఐ)- సామాజిక న్యాయం, సాధికారత
- 41. రామ్ నాథ్ ఠాకూర్ (కొత్త) (జేడీయూ) – వ్యవసాయ, రైతు సంక్షేమం
- 42. నిత్యానందరాయ్ (భాజపా)- హోం
- 43. అనుప్రియ పటేల్ (అప్నాదళ్)- ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు – రసాయనాలు
- 44. వి.సోమన్న (కొత్త) (భాజపా)- జల్ శక్తి, రైల్వే
- 45. పెమ్మసాని చంద్రశేఖర్ (కొత్త) (తెదేపా)- గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్
- 46. ఎస్.పి.సింగ్ బఘేల్ (భాజపా)- మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ, పంచాయతీ రాజ్
- 47. శోభా కరంద్లాజే (భాజపా)- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి
- 48. కీర్తివర్ధన్ సింగ్ (కొత్త) (భాజపా)- పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ
- 49. బీఎల్ వర్మ (భాజపా) – వినియోగదారుల వ్యవహారాలు, ఆహార – ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం – సాధికారత
- 50. శాంతనూ ఠాకూర్ (భాజపా) – పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్
- 51. సురేష్ గోపి (కొత్త) (భాజపా) – పెట్రోలియం, సహజవాయువులు, పర్యటకం
- 52. ఎల్.మురుగన్ (భాజపా) – సమాచార – ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు
- 53. అజయ్ టంటా (భాజపా) –
- 54. బండి సంజయ్ కుమార్ (కొత్త) (భాజపా) – హోంశాఖ
- 55. కమలేష్ పాశ్వాన్ (కొత్త) (భాజపా) –
- 56. భగీరథ్ చౌదరి (కొత్త) (భాజపా) –
- 57. సతీశ్ చంద్రదూబే (కొత్త) (భాజపా) –
- 58. సంజయ్ సేఠ్ (కొత్త) (భాజపా)-
- 59. రవ్‌నీత్ సింగ్ బిట్టూ (కొత్త) (భాజపా) –
- 60. దుర్గాదాస్ ఉయికె (కొత్త) (భాజపా)-
- 61. రక్షా నిఖిల్ ఖడ్సే (కొత్త) (భాజపా)-
- 62. సుఖాంత మజుందార్ (కొత్త) (భాజపా) –
- 63. సావిత్రి ఠాకుర్ (కొత్త) (భాజపా)-
- 64. టోకన్ సాహు (కొత్త) (భాజపా) –
- 65. రాజభూషణ్ చౌదరి (కొత్త) (భాజపా)-
- 66. భూపతిరాజు శ్రీనివాస వర్మ (కొత్త) (భాజపా) – భారీ పరిశ్రమలు, ఉక్కు
- 67. హర్ష్ మల్హోత్రా (కొత్త) (భాజపా) –
- 68. నిముబెన్ జయంతిభాయ్ బాంభణియా (కొత్త) (భాజపా)-
- 69. మురళీధర్ మొహోల్ (కొత్త) (భాజపా) –
- 70. జార్జ్ కురియన్ (కొత్త) (భాజపా) –
- 71. పబిత్ర మార్గరీటా (కొత్త) (భాజపా)