కుమార్తెకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి

కన్న కుమార్తెకు నిద్రమాత్రలు ఇచ్చిన తల్లి.. తన ప్రియుడితో అత్యాచారం చేయించిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు… చెన్నై సాలిగ్రామానికి చెందిన ఓ వ్యక్తి కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, 20ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా కాపలాదారుగా పనిచేస్తూ వారానికి ఒకసారే ఇంటికి వెళ్తుండటంతో భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని పిలిపించుకుంటుండగా కుమార్తె తల్లిని మందలించింది. వినకపోవడంతో మాట్లాడటం మానేసింది. ఈ క్రమంలో గత నెల 3వ తేదీ అనారోగ్యంతో ఉన్న కుమార్తెకి తల్లి నిద్రమాత్రలు ఇచ్చి ప్రియుడిని పిలిపించి అత్యాచారం చేయించింది.


23వ తేదీ మళ్లీ యువతికి అనారోగ్యం ఏర్పడటంతో నిద్రమాత్రలు ఇచ్చి అత్యాచారానికి పాల్పడటంతో స్పృహలోకి వచ్చిన యువతి పెద్దగా కేకలు వేసింది. బయటకు చెప్పకూడదని బెదిరించిన తల్లి గదిలో ఉంచి తాళం వేసింది. అనంతరం తప్పించుకున్న యువతి తిరువణ్ణామలైలో ఉన్న బంధువు ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పింది. ఈ నేపథ్యంలో కడుపునొప్పితో బాధపడుతున్న యువతిని బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భంతో ఉన్నట్లు తేలింది. సెయ్యారు మహిళా పోలీసు స్టేషన్‌లో తల్లి ప్రియుడు దక్షిణామూర్తి(50)పై ఫిర్యాదు చేశారు. ఘటన జరిగింది వడపళనిలో కావడంతో వడపళని ఆల్‌ ఉమెన్‌ పోలీస్‌స్టేషన్‌కి కేసుని బదిలీ చేశారు. అనంతరం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.