ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎన్నో మార్పులు చేశాడు. ఎక్స్‌గా పేరు మార్చడం మొదలు ప్రీమియం సేవలను అందిస్తూ ఆదాయ మార్గాలను పెంచడమే లక్ష్యంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా ఎక్స్ టీవీ యాప్ పేరుతో మరో సంచలనానికి తెరతీశాడు మస్క్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్‌కు పోటీనిచ్చే దిశగా మస్క్ ఈ కొత్త యాప్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
స్మార్ట్ టీవీలకు సపోర్ట్ చేసే విధంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యాప్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం ఈ యాప్‌లో లతో పాటు, లైవ్ టీవీ వంటివి చూసే అవకాశం లభించనున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ యాప్ మొదట ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఎల్‌జీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీ వంటి వాటిలో మాత్రమే అందుబాటులోకి రానున్టన్లు తెలుస్తోంది. గూగుల్ ప్లేస్టోర్, ఎల్‌జీ స్టోర్ లేదా అమెజాన్ స్టోర్స్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ యాప్‌లో ట్రెండింగ్ వీడియో అల్గారిథమ్, వీడియో సెర్చింగ్ వంటి వాటితో పాటు.. రీప్లే టీవీ, స్టార్ట్‌ఓవర్ టీవీ, ఫ్రీ క్లౌడ్ డీవీఆర్ (100 గంటలు కంటెంట్‌ను రికార్డ్ చేయవచ్చు) వంటి ఫీచర్లను అందించనున్నట్లు తెలుస్తోంది.