అభిమన్యుడి పాత్రలో నందమూరి మోక్షజ్ఞ! ప్రశాంత్ వర్మ ప్లాన్

www.mannamweb.com


నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య వారసుడి వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. గతంలో వచ్చిన రూమర్లను నిజం చేస్తూ మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను ప్రశాంత్ వర్మకే అప్పగించాడు నందమూరి బాలకృష్ణ.

ఇక తన మొదటి కోసం స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యాడు మోక్షు. తన మేకోవర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడీ జూనియర్ నట సింహం. వీటిని చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక తాజాగా తన డెబ్యూ మూవీపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు బాలయ్య కుమారుడు. ఇందులో తన షూట్ కూడా స్టార్ట్ పోయినట్లు చెప్పుకొచ్చాడు జూనియర్ నట సింహం. ‘ఇంట్రడక్షన్ సీన్, స్టోరీ, ఎలివేషన్, హై మూమెంట్స్, అన్ని మీ అంచనాలను మించి ఉంటాయి’ అంటూ మోక్షు చేసిన ట్వీట్ కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మోక్షు- ప్రశాంత్ కాంబినేషన్ కు సంబంధించి కొన్ని క్రేజీ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. మోక్షజ్ఞ లో బాలయ్య కూడా ఒక కీలక పాత్ర పోషిస్తాడని రూమర్లు వినిపిస్తున్నాయి. అలాగే ప్రశాంత్ వర్మ తన లో మోక్షజ్ఞను అభిమాన్యుడిగా చూపించబోతున్నారని వినిపిస్తున్నారు.

ప్రశాంత్ వర్మ టిక్ యూనివర్స్ లో భాగంగా మోక్షజ్ఞను కూడా ఒక సూపర్ హీరో తరహాలోనే తెలుగు ఆడియెన్స్ కు ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది. అయితే అభిమన్యుడు అనగానే చాలామందికి నెగెటివ్ సెన్స్ వినిపిస్తుంది. చనిపోయే వీరుడి పాత్రలో మోక్షజ్ఞను చూపించడం ఏంటి? అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అభిమన్యుడు చేసింది ఒక్కరోజు యుద్ధమైనా చరిత్రలో నిలిచిపోయాడు. పద్మవ్యూహంలోకి వెళ్లి వేలాది మంది సైనికులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడీ పాత్రకు మోక్షజ్ఞ బాగా సూట్ అవుతాడని ప్రశాంత్ వర్మ భావిస్తున్నాడట. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం గాసిప్ మాత్రమే. ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారంటీ. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి, మోక్షజ్ఞ పాత్రకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది.