కొత్త ట్రెండ్..: ప్రీ వెడ్డింగ్ షూట్‌లా ప్రీ ఫస్ట్ నైట్ షూట్
జనాల్లో పిచ్చి పరాకాష్టకు చేరుతుందనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి నూతన వధూవరులు ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వాగులు, వంకలు, గుట్టలు గట్రా తిరుగుతున్న ఘటనలు ఎన్నో.
మరికొందరైతే, వినూత్నంగా ఉంటుందని బురదలో పొర్లుతూ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. రాను..రాను ఈ ట్రెండ్ అందరూ ఫాలో అవుతుండడంతో యువజంటలు కొత్తగా మరో ట్రెండ్ పుట్టించేశారు. అదే.. ప్రీ ఫస్ట్ నైట్ షూట్.
శోభన కార్యక్రమాలు అంటే, నాలుగు గోడల మధ్య చడీ చెప్పులు లేకుండా జరిగిపోవాలి. కానీ, రోజులు మారాయి.. వస్తున్న యువకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కాకపోతే, కోరుకుంటున్న ఆ కొత్తదనం, వినూత్న ఆలోచనలు ఏటో దారితీస్తున్నాయి. తాజాగా, ఓ యువ జంట తమ శోభనం రాత్రిని వినూత్నంగా జరుపుకోవాలని అనుకున్నారు. ఆ ఆలోచన రూపమే.. ప్రీ ఫస్ట్ నైట్ షూట్. శోభనం జరగాల్సిన గదిని అందంగా అలంకరించి.. కొన్ని దృశ్యాలను కెమెరాలో బంధించి జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
కొత్త ట్రెండ్..: ఫ్రీ ఫస్ట్ నైట్ షూట్.. pic.twitter.com/sFANzr9T0k
— Govardhan Reddy Dasari (@SportsNewsInd24) July 28, 2024
వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను బట్టి ఒక యువ జంటకు శోభనమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గది లోపల పరిసరాలను బెలూన్లతో అందంగా ముస్తాబు చేశారు. వరుడు ముసిముసి నవ్వులు ఒలికిస్తే గది లోపల ఉంటే, వధువు పాల గ్లాస్ పట్టుకొస్తోంది. లోపలకి వచ్చాక భర్త చేతికి పాల గ్లాస్ అందిస్తోంది. ఆక్కడితే, వీడియో పరిసమాప్తమయ్యింది కానీ, లేదంటే ఏం జరిగేదో..
సగంలోనే ఆపేసారేం..!
ఈ వీడియోపై నెటిజెన్ల కామెంట్లు శృతిమించుతున్నాయి. ఏదో ఆశించి వచ్చిన వారు సగంలోనే ఆపేసారేం ఫుల్ వీడియో పెట్టండి.. అని బహిరంగంగానే తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.