పాలకూరలో ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కావలసిన అనేక మంచి పోషకాలు ఉంటాయి. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే తో పాటుగా క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, తక్కువ క్యాలరీలు ఉంటాయి.
పాలకూరను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
పాలకూర కళ్లకు మేలు చేస్తుంది. పాలకూరలో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కళ్ల దృష్టిని మెరుగుపరుస్తుంది. గ్లాకోమా, మాక్యులర్ డిజీజ్ వంటి కంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు, ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
పాలకూరలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. పాలకూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
పాలకూరలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. కాల్షియం, విటమిన్ కె పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలను బలపరుస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారిస్తుంది.
పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బిపి, మధుమేహం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. పాలకూరలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముడతలు పడకుండా కాపాడతాయి. పాలకూరలోని యాంటీ క్యాన్సర్ గుణాలు కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గిస్తుంది.