ఓటిటిలో విడుదలైన తర్వాత పెరుగుతున్న ట్రోలింగ్

www.mannamweb.com


చచ్చిన పామును ఏం కొడతాంలే అనుకునేవాళ్లు కొందరైతే.. అది చచ్చిందో లేదో అనే అనుమానంతో ఇంకా కొట్టేవాళ్లు మరికొందరు. ఇప్పుడు ఈ సామెత ఎందుకబ్బా అనుకుంటున్నారు కదా..?
ఆల్రెడీ థియేటర్స్‌లో ఫ్లాపైన ల్ని ఓటిటిలో చూసి.. ఇక్కడ కూడా రోస్ట్ చేస్తుంటే ఇలాంటి సామెతలే వస్తాయి. మరి అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్న లేంటి..? కాస్త గ్యాప్ ఇవ్వండ్రా.. అప్పుడెప్పుడో రాత్రనంగా మొదలుపెట్టారు.. తెల్లవార్లూ ఈ బ్యాగ్రౌండ్ ఏంట్రా బాబూ

చచ్చిన పామును ఏం కొడతాంలే అనుకునేవాళ్లు కొందరైతే.. అది చచ్చిందో లేదో అనే అనుమానంతో ఇంకా కొట్టేవాళ్లు మరికొందరు. ఇప్పుడు ఈ సామెత ఎందుకబ్బా అనుకుంటున్నారు కదా..? ఆల్రెడీ థియేటర్స్‌లో ఫ్లాపైన ల్ని ఓటిటిలో చూసి.. ఇక్కడ కూడా రోస్ట్ చేస్తుంటే ఇలాంటి సామెతలే వస్తాయి. మరి అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్న లేంటి..?

కాస్త గ్యాప్ ఇవ్వండ్రా.. అప్పుడెప్పుడో రాత్రనంగా మొదలుపెట్టారు.. తెల్లవార్లూ ఈ బ్యాగ్రౌండ్ ఏంట్రా బాబూ..! బయటికి చెప్పుకోవట్లేదు గానీ ఈ మధ్య కొన్ని లు ఓటిటిలో వచ్చిన తర్వాత జరుగుతున్న ట్రోలింగ్ చూసాక దర్శక నిర్మాతల ఇన్నర్ ఫీలింగ్ ఇదే.

తాజాగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లకు ఇదే మ్యూజిక్ రన్ అవుతుంది. మిరపకాయ్ లాంటి హిట్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన మిస్టర్ బచ్చన్. మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం థియెట్రికల్‌గా దారుణంగా నిరాశ పరిచింది.

అయితే ఓటిటిలో ఇప్పుడొచ్చిన ఈ ను సీన్స్ సీన్స్‌గా విడగొట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్‌కు ఇది తప్పలేదు. ఆ మధ్య శంకర్ ఇండియన్ 2ను ఇలాగే ఆడుకున్నారు ట్రోలర్స్.

మగాడిగా పుట్టినందుకు ఫస్ట్ టైమ్ ఫీల్ అవుతున్నా అనే డైలాగ్ పెట్టి హరీష్ శంకర్‌ను ట్రోల్ చేస్తున్నారు.. అలాగే మరికొన్ని సీన్స్ కూడా. ఇక డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్‌లో ప్రగతి రన్నింగ్ చేస్తూ కార్ అందుకునే సీన్‌పై ట్రోలింగ్ ఆగట్లేదు. ఇండియన్ 2ను అయితే మరింత ముక్కలు ముక్కలు చేసి ఆడుకుంటున్నారు. మొత్తానికి ఓటిటిలోనూ ఈ లకు ప్రశాంతత లేకుండా పోయింది.