రోజుకో స్పూను బొప్పాయి ఆకుల రసం తాగితే బోలెడు లాభాలు..!

www.mannamweb.com


బొప్పాయి పండు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. అయితే కేవలం పండుతోనే కాకుండా బొప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలే ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అందుకే ఆయుర్వేద మందుల్లో దాన్ని వాడుతారు. ఈ బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు అంటున్నారు. బొప్పాయి ఆకుతో కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

బొప్పాయి ఆకులను జ్యూస్‌ చేసి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి జ్యూస్‌ తాగడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది. బొప్పాయి ఆకుల ర‌సంలో విట‌మిన్లు ఎ, ఇ, సి, కె, బి లు అధికంగా ఉంటాయి. ఈ జ్యూస్‌ తాగడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది.

బొప్పాయి ఆకుల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం సమస్యలతో బాధపడుతున్నవారు ఈ బొప్పాయి ఆకు జ్యూస్‌ తీసుకోవడం వల్ల సమస్య త‌గ్గుతుంది. బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.

చుండ్రు, జుట్టు రాలిపోవడం, జుట్టులో దురద వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు బొప్పాయి ఆకుల రసాన్ని తలకు పట్టిస్తే ప్రయోజనం ఉంటుంది. జుట్టు తెల్లబడటం, సన్నగా అయిపోవడం వంటి సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. జుట్టు మెరుస్తుంది కూడా… షాంపూ కండీషనర్‌లా ఇది పనిచేస్తుంది.

బొప్పాయి ఆకుల్లో ఉండే ఫెనొలిక్ అనే కాంపౌండ్, పపాయిన్, అల్కనాయిడ్స్ అనే పోషకాలు యాంటీఆక్సిడెంట్లలా పని చేసి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాన్సర్ రాకుండా కూడా బొప్పాయి ఆకుల రసం ఉపయోగపడుతుంది. బొప్పాయి ఆకుల రసం… మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచగలదు. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి బొప్పాయి ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలు తేల్చాయి.

కొంత మందికి తినే ఆహారం సరిగ్గా అరగదు. దీంతో కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఈ సమస్యకు బొప్పాయి రసం ఓ టేబుల్ స్పూన్ తాగితే సరిపోతుంది. పొట్టలో గ్యాస్, అల్సర్, నొప్పి వంటివి మటుమాయం అవుతాయి. మహిళల్లో రుతుక్రమ సమస్యల్ని సరిచెయ్యడంలో బొప్పాయి ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో హార్మోన్లను ఇది క్రమబద్ధీకరిస్తుంది.