ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కుమారుడ్ని స్కూల్లో చేర్పించేందుకు హైదరాబాద్ వచ్చారు.
పటాన్ చెరు సమీపంలోని ఇక్రిశాట్ లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో తన కుమారుడ్ని చేర్పించారు. అక్కడ మొదట అడ్మిషన్ తీసుకోవడానికే పదిలక్షల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఏడాదికి ఫఈజులు ఇతర ఖర్చులు కలిపి పది లక్షల వరకూ ఖర్చవుతుందని అంచనా. అంటే ఏటా ఇరవై లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ స్కూల్ లో ఫీజుకు తగ్గ ప్రమాణాలు ఉంటాయి. ఇటీవలి కాలంలో సినీ సెలబ్రిటీలంతా ఇక్కడే చదివిస్తున్నారు. మహేష్ బాబు కుమారుడు ఇక్కడే చదివి ..పై చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. అల్లు అర్జున్ పిల్లలు ఇక్కడే చదువుతున్నారు.
స్కూల్ ప్రత్యేకతలు
ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ISH) హైదరాబాద్‌లోని పటాన్‌చెరు లోని ఇక్రిశాట్ క్యాంపస్‌లో ఉంటుంది. ఇది ఒక ప్రతిష్టాత్మక, నాన్-ప్రాఫిట్, ఇంగ్లీష్ మీడియం అంతర్జాతీయ పాఠశాలగా చెబుతారు. 1981లో దీన్ని స్థాపించారు. విదేశీ విద్యార్థులు , విదేశాలలో ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే భారతీయ విద్యార్థుల కోసం ఈ స్కూల్ ప్రత్యేకంగా కరికులం రూపొందించింది. ఇది న్యూ ఇంగ్లాండ్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ (NEASC) , కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ (CIS) ద్వారా అక్రిడేషన్ పొందిన పాఠశాల.
విద్యా విధానం విభిన్నంగా ఉంటంది. ఎలిమెంటరీ నుండి గ్రేడ్ 12 వరకు విద్య అందిస్తారు. గ్రేడ్ 8 వరకు కామన్ గ్రౌండ్ కొలాబొరేటివ్ (CGC) పద్ధతిలో ఉంటుంది. బట్టీపట్టడం, పరీక్షలు, మార్కులు వంటివి ఉండవ..ుు గ్రేడ్ 9 , 10లో ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (IGCSE) కేంబ్రిడ్జ్ కరికులమ్ అనుసరిస్తారు. గ్రేడ్ 11స 12లో ఇంటర్నేషనల్ బాకలారియేట్ డిప్లొమా ప్రోగ్రామ్ లేదా ISH డిప్లొమా ప్రోగ్రామ్ విధానంలో బోధిస్తారు.
ఇందులో విద్యార్థులు వివిధ దేశాల నుంచి వచ్చిన వారు ఉంటారు. మొత్తం నాలుగు వందల మంది విద్యార్థులు ఉంటే అందులో 23 దేశాలకు చెందిన వారు ఉన్నారు. 34 శాతం సిబ్బంది 12 విభిన్న దేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ ఉపాధ్యాయులు. 10 ఎకరాల విశాలమైన క్యాంపస్‌లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీ, లాబొరేటరీలు, నాలుగు అవుట్‌డోర్ ఫీల్డ్‌లు, మల్టీ-పర్పస్ జిమ్, ఆడిటోరియం ఈ స్కూల్ ప్రత్యేకత. విద్యార్థులను అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో చేరేలా ఎడ్యుకేషన్ ఉంటుంది. “రైట్ ఫిట్” విధానం ద్వారా ప్రవేశాలు ఇస్తారు. పాఠశాల విద్యా విధానంతో సర్దుకుపోయే విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. భారతీయ పౌరులకు పరిమిత సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉంటాయి. డబ్బులు ఉన్న వారందర్నీ చేర్చుకోరు.
































