ఆఫ్-రోడ్ ‘జిమ్నీ’.. లక్ష మంది కొన్నారు..

ఫ్‌-రోడ్‌లో దూసుకెళ్లే మారుతి సుజుకి జిమ్నీ విక్రయాల్లోనూ దూసుకెళ్లింది. సరికొత్త మైలురాయిని దాటింది. మారుతి సుజుకి జిమ్నీ మొదటిసారిగా 2023 జూన్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయింది.


అప్పటి నుండి ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ 5-డోర్ల వెర్షన్ లక్ష యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. ఆటోకార్ ప్రొఫెషనల్స్ నివేదిక ప్రకారం.. రెండు సంవత్సరాలలో ఈ వాహనం మొత్తం 1,02,024 యూనిట్ల అమ్మకాలను సాధించింది.

మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ మొత్తం విక్రయాల్లో దేశీయ మార్కెట్లో విక్రయించిన 26,180 యూనిట్లు (2025 ఏప్రిల్ చివరి వరకు లాంచ్ అయినవి), 75,844 ఎగుమతి యూనిట్లు (2025 ఏప్రిల్ చివరి వరకు లాంచ్ అయినవి) ఉన్నాయి. అయితే మారుతి సుజుకి జిమ్నీ అమ్మకాల సంఖ్య పరంగా దాని ప్రధాన ప్రత్యర్థులలో ఒకటైన మహీంద్రా థార్ శ్రేణి కంటే చాలా వెనుకబడి ఉంది. 2020 అక్టోబర్‌లో లాంచ్ అయినప్పటి నుండి 2025 ఏప్రిల్ చివరి వరకు మూడు డోర్ల థార్, థార్ రాక్స్ తో, ఎస్‌యూవీ శ్రేణి మొత్తం 2,59,921 యూనిట్లతో 2.5 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది.

మారుతి సుజుకి జిమ్నీ మూడు డోర్ల వర్షన్‌ ప్రపంచ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందింది. ఈ పాపులారిటీని పునరావృతం చేయడానికి కంపెనీ ఐదు డోర్ల వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆఫ్-రోడర్ కొనుగోలుదారులను ఆకర్షించే లక్ష్యంతో ఈ వాహనం 4×4 సిస్టమ్‌తో బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్‌తో వచ్చింది. ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్‌లో రూ .12.75 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అమ్మడవుతోంది. దీనిని గురుగ్రామ్ ప్లాంట్లో తయారు చేసి జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.

మారుతి సుజుకి జిమ్నీలో సింగిల్ 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 105 బీహెచ్‌పీ పవర్‌ని, 134 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడి ఉంటుంది. మాన్యువల్ వెర్షన్ లీటరుకు 16.94 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 16.39 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.