డిగ్రీ, బి.టెక్ ఉన్నవారికి అద్భుతమైన అవకాశం.. నెలకు రూ.90 వేల జీతం.. వివరాలు మీ కోసం.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 2025-26 సంవత్సరానికి గాను జనరలిస్ట్, స్పెషలిస్ట్ స్కేలు-I విభాగంలో 266 ఖాళీల భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరింది.


అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూన్‌ 12 నుంచి జులై 3 వరకు ఆన్‌లైన్‌లో https://nationalinsurance.nic.co.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

ఉద్యోగాలు: జనరలిస్ట్ 170, డాక్టర్లు (ఎంబీబీఎస్‌) 14, లీగల్ 20, ఫైనాన్స్ 21, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20, ఆటోమొబైల్ ఇంజినీర్లు 21 పోస్టులు.

విద్యార్హత: విభాగాన్ని బట్టి డిగ్రీ, బీకామ్‌, బీటెక్‌/బీఈ, ఎంబీబీఎస్‌, పీజీ, ఎంకామ్‌, ఎల్‌ఎల్‌ఎం, ఎంఈ/ఎంటెక్‌, ఎంఎస్‌/ఎండీ పాసై ఉండాలి. అంతకుముందు చేసిన పని అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 2025 మే 1 నాటికి 21 నుంచి 31 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,925 నుంచి రూ.90,000 వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, డీడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.