ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
తన పదవికి దిష్టి తగిలినట్లు ఓ జ్యోతిష్యుడు పవన్ కళ్యాణ్ కు చెప్పాడట. దీంతో ఆ శాఖ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో పడ్డారట డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వద్ద దాదాపు 5 శాఖలు ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉన్నాయి. వాటికి తోడు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి కూడా పవన్ కళ్యాణ్ కలిగి ఉన్నారు. అయితే ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని వదులుకొని, మరో కొత్త శాఖపై ఫోకస్ చేశారంట పవన్ కళ్యాణ్. కందుల దుర్గేష్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారట. అతని వద్ద ఉన్న ఆ సినిమాటోగ్రఫీ మంత్రి శాఖను పవన్ కళ్యాణ్ హ్యాండోవర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. Pawan Kalyan
లేదా ఆ శాఖను ఎమ్మెల్సీగా గెలుపొందిన నాగబాబుకు ఇచ్చే ప్రయత్నం జరుగుతోందట. ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలు చేశారు. ఆ టాపిక్ పవన్ కళ్యాణ్ కు నిద్రలేకుండా చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే తన శాఖకు రాజీనామా పెడితే పెద్ద వార్త కాబోతోంది. అప్పుడు మ్యాటర్ మొత్తం అతని పదవి పైనకు వెళ్లనుంది. జనాలు కూడా ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఈ డైవర్షన్ పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నారట.

































