pooja: శ్రీవారిని ఏడు శనివారాలు ఇలా పూజిస్తే..

www.mannamweb.com


శ్రీపాదాలు ( venkateswara swami) కొలిస్తే ఐశ్వర్యప్రాప్తి జరుగుతుందనేది పురాణాల మాట. అందుకే శ్రీవారిని పూజ చేస్తే ఇంట్లో ధనానికి లోటు ఉండదు.
ఏం చేస్తే ధనానికి లోటు ఉండదో ..తెలుసుకుందాం.

శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు ముగించి, పూజగదిని ( pooja) శుభ్రం చేసి వేంకటేశ్వర స్వామిని ( venkateswara swami) అలంకరించాలి. పూజ ప్రారంభించి సంకల్పం చెప్పుకోవాలి. బియ్యపుపిండి, పాలు, బెల్లం, అరటి పండు కలిపి దాంతో ప్రమిదను తయారు చేయాలి. ఇందులో ఏడు వత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించాలి. స్వామి వారికి కర్పూరం కలిపిన లడ్డు ఇష్టం . అది కుదిరినంత వరకు మీరే చేసి స్వామికి నైవేధ్యం ఇవ్వండి. స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున వైష్ణవులు శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వేకువజామునే స్నానం చేసి తులసి( tulasi) కోట ముందు ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించినవారికి అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి. స్వామి మీద నమ్మకం ఉంచండి.
శనివారం( satuarday) సాయంత్రం వేంకటేశ్వర( venkateswara swami) ఆలయంలో ఆవు నేయితో( ghee diya) దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా ఏడు శనివారాలు స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులన్నీ నిరాటంకంగా సాగుతాయి. ఈ దీపం వల్ల ఇళ్లు, పెళ్లి అన్ని జరుగుతాయి.