Priyanka Chopra:గ్లోబల్ స్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ ద్వారా తన కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని.. ప్రస్తుతం హాలీవుడ్లో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో మహేష్ బాబు(Maheshbabu ) హీరోగా నటిస్తున్న ‘వారణాసి’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక అలాంటి ఈమె ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు నెలకొన్నాయి అని తెలిసి అభిమానులు సైతం దుఃఖింతులవుతున్నారు. అసలు ఏమైంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం
ప్రియాంక చోప్రా ఇంట్లో విషాదం..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, ప్రముఖ సింగర్ నిక్ జోనస్ (Nick Jonas) కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు, నిక్ జోనస్ తన సొంత సోదరిలా భావించే మాయా కిబెల్ (Maya kibel) తుది శ్వాస విడిచారు. కేవలం 30 సంవత్సరాల వయసులోనే ఆమె కళ్ళు మూయడం నిక్ జోనస్ కుటుంబాన్ని పూర్తిస్థాయిలో విషాదంలోకి నెట్టివేసింది.. అయితే ఆమె మరణానికి గల కారణం ఏమిటి అనే విషయాన్నికొస్తే.. మాయా కిబల్ గత కొంతకాలంగా “విల్సన్” అనే ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నట్లు సమాచారం.
అరుదైన వ్యాధితో మృతి..
ఈ వ్యాధి కారణంగానే శరీరంలో రాగి పేరుకుపోయి.. కాలేయం , మెదడు ఇతర కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిందట.. ఇక దీంతో మార్చి 7న ఉదయం మాయా అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయిందని.. ఆ సమయంలో ఆమె గుండె, ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోయాయని మాయ తల్లి కియోకో కిబెల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇకపోతే తన కూతుర్ని వెంటనే హాస్పిటల్ కి తరలించి మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం ప్రియాంక చోప్రా భర్తకు సోదరీ సమానమైన మాయ మరణంతో అటు ప్రియాంక చోప్రా కూడా తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.
నివాళులర్పించిన నిక్ జోనస్ , ప్రియాంక చోప్రా..
నిక్ జోనస్ తో మాయా కిబెల్ కి విడదీయరాని బంధం ఉండేది . ఆమె జోనస్ బ్రదర్స్ కి పొరుగున నివసించేవారట. చిన్నప్పటినుంచే నిక్ జోనస్ , మాయ కిబెల్ కలిసి పెరిగారు.. నిక్ జోనస్ ఆమెను తన సొంత చెల్లి కంటే ఎక్కువగా భావించేవారు. క్రిస్మస్ వేడుకల నుంచి టూర్ల వరకు ప్రతి విషయంలో కూడా ఈ రెండు కుటుంబాలు కలిసి ఒక దగ్గరే ఉండేవారు. అలాంటి చెల్లి మరణించడంతో నిక్ జోనస్ భావోద్వేగ నివాళి తెలిపారు. ” నా సోదరీ శాశ్వతంగా దూరమైపోయింది. మాయ నేనెప్పుడూ నీతోనే ఉంటాను” అంటూ ఆయన ఎమోషనల్ గా కామెంట్ చేశారు. అటు నిక్ జోనస్ ఇటు ప్రియాంక చోప్రా ఇద్దరు కూడా మాయ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
తల్లడిల్లిపోతున్న తల్లి..
ఇకపోతే మాయ తల్లి మాయా అనుభవించిన నరకాన్ని వివరిస్తూ ఇన్స్టా లో ఒక పోస్ట్ కూడా పెట్టింది..” మాయా విల్సన్ వ్యాధితో ఎంతో పోరాడింది. ఆ నొప్పిని తట్టుకోలేక అప్పుడప్పుడు ఏడుస్తూనే నిద్రపోయేది.. ఆమె పడిన నరకం ఎవరు అనుభవించకూడదు. ఏ బాధ లేని లోకానికి ఇప్పుడు వెళ్లిపోయిందని అనుకుంటున్నాను. నా మనసును నేనే ఓదార్చుకుంటున్నాను” అంటూ కియోకో కిబెల్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఏది ఏమైనా కూతురు మరణాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోతోంది అనడంలో సందేహం లేదు.

































