పుల్ల రెడ్డి స్వీట్ షాపుకి ఇంత స్టోరీ ఉందా.. సైకిల్ నుండి అమెరికా వరకు.. కోట్ల ఆదాయం

www.mannamweb.com


స్వీట్స్ అనగానే ఎక్కువగా గుర్తొచ్చేది పుల్ల రెడ్డి స్వీట్స్. పుల్ల రెడ్డి స్వీట్ షాప్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అన్ని నగరాల్లో కనిపిస్తుంటుంది.

అయితే ఈ పుల్ల రెడ్డి స్వీట్ షాప్ ఎలా మొదలైంది, ఈ పేరు ఎలా వచ్చింది తెలియాలంటే ముందు దీని వెనుక ఉన్న వ్యక్తి గురించి తెలియాలి. జనవరి 1న కర్నూలు జిల్లాలోని గోకవరంలోని ఓ పేద కుటుంబంలో జన్మించిన పుల్లారెడ్డి 5వ తరగతి వరకు చదివి ఆ తర్వాత చదువును మానేశారు. చదువు అబ్బకపోవడంతో కర్నూలులోని తన బాబాయ్‌ కసిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర అతనిని జీతానికి ఉంచారు. అప్పుడే పుల్లారెడ్డి పెళ్లి జరిగింది. తన బాబాయ్‌ జీతం పెంచకపోవడంతో పని నుంచి బయటికి వచ్చి కర్నూల్లో సొంతంగా టి కొట్టు పెట్టుకున్నాడు. ఇందుకు రూ.25 అప్పు చేసి వ్యాపారం స్టార్ట్ చేసాడు. టి కొట్టుతో పాటు ఎండాకాలంలో మజ్జిగ కూడా అమ్మేవాడు. ఆలా ఆ తరువాత భుజాన దుస్తులు పెట్టుకొని కూడా తిరుగుతూ అమ్మేవాడు. ఇలా వ్యాపారంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగాడు. స్నేహితుడితో కలిసి ప్రారంభించిన దుస్తుల వ్యాపారంలో సక్సెస్ కాలేకపోయాడు. తన పార్ట్నర్ మోసం చేయడంతో ఆర్ధికంగా చాల మోసపోయాడు. నష్టాలకి భయపడనీ పుల్లారెడ్డి ఆ తరువాత వెయ్యి రూపాలతో అప్పు చేసిన స్వీట్ షాప్ ప్రారంభించాడు. 1948లో మొదలైన పుల్లారెడ్డి ప్రస్థానం నేడు కోట్ల వ్యాపారానికి చేరింది. ఇలా 1957లో హైదరాబాద్లోని అబిడ్స్ లో ట్వీట్ హౌజ్ ప్రారంభించి తరువాత తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో బ్రాంచులు ఓపెన్ చేసారు. కేవలం స్వీట్ షాప్స్ మాత్రమే కాకూండా ఎన్నో విద్య సంస్థలను ఏర్పాటు చేసారు. సంపాదించినా దాంట్లో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు అండగా నిలిచారు.

జి పుల్లారెడ్డి స్వీట్స్ ఆదాయం

2013లో పుల్లారెడ్డి స్వీట్స్ ఆర్జించింది ఆదాయం రూ.45 కోట్లు. జి పుల్లా రెడ్డి స్వీట్స్ అనేది హైదరాబాద్‌లోని భారతీయ స్వీట్లు అమ్మే ఒక స్వీట్ షాప్. పుల్ల రెడ్డి స్వీట్లు పూతరేకులు ఇంకా బెల్లం కాజుకి ఫెమస్.

1948లో 28 సంవత్సరాల వయస్సులో ఉన్న జి పుల్లా రెడ్డి మొదట్లో కర్నూలు జిల్లాలోని స్వగ్రామమైన గోకవరంలో భార్య తయారు చేసిన మిఠాయిలు సైకిల్‌పై తిరుగుతూ అమ్మేవారు. తరువాత1948లో కర్నూలు పట్టణంలో చిన్న మిఠాయి షాప్ తెరిచారు. క్రమంగా, పుల్లా రెడ్డి స్వీట్ల నాణ్యతతో మంచి పేరు సంపాదించాడు. 1954లో అతను రాజ్‌భవన్‌కు అఫీషియల్ స్వీట్ సప్లయర్ అయ్యాడు. హైదరాబాద్, కర్నూలు ఇంకా దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా స్వీట్ షాపులను స్థాపించాడు. ఇలా అతని వ్యాపారం మెల్లిమెల్లిగా పెరిగింది, కర్నూలు సందుల నుండి చివరికి ఇండియా నాలుగు దిక్కులల్లో వ్యాపారం విస్తరించింది. న్యూయార్క్, కాలిఫోర్నియా, షార్లెట్‌తో సహా US నగరాల్లో కూడా స్టోర్స్ తెరిచాడు.

1974లో ఆర్‌ఎస్‌ఎస్ సంఘ్ చాలక్‌గా మారారు.1975లో ‘పుల్లారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్’ స్థాపించారు.1980లో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. అదే సంవత్సరం సంస్కృత భాషా ప్రచారం కోసం ‘సంస్కృత భాషా ప్రచార సమితి’ని స్థాపించాడు. అతను కర్నూల్‌లో జి పుల్లా రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీని స్థాపించాడు. హైదరాబాద్‌లో జి. నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌ను ప్రారంభించాడు. హైదరాబాద్ సహా కర్నూలులో ఎన్నో కళాశాలలను స్థాపించడమే కాకుండా, పుల్లారెడ్డి ‘విజ్ఞాన పీఠం’ అనే స్కూల్ కూడా స్థాపించాడు. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించి వారికి విద్యను అందిస్తున్నారు. ఉడిపి పెజావర్ మఠం 1991లో పుల్లారెడ్డిని ‘దానగుణ భూషణ’ బిరుదుతో అలంకరించింది. వ్యాపారంలో నిజాయితీకి ఆ మరుసటి సంవత్సరం ”జమ్నాలాల్ బజాజ్ అవార్డు”తో సత్కరించింది. అతని కుమారుడు జి. రాఘవ రెడ్డి, ప్రస్తుతం విశ్వహిందూ పరిషత్‌లో అంతర్జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పుల్ల రెడ్డి 9 మే 2007న 87 ఏళ్ల వయసులో మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.