Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు తేలికపాటి వర్షాలు..

సూర్యుడి భగభగలకు.. వరుణుడు కాస్త బ్రేక్ ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. ఆదివారం మధ్యాహ్నం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడి మోస్తారు వర్షాలు.. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ స్పష్టం చేశారు.


మరోవైపు తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. 12 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కింది ఐఎండీ. 50-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని.. పలు ప్రాంతాల్లో ఏప్రిల్ 19 రాత్రి నుంచే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్సుందన్నారు.