XCLUSIVE: YSRCP మంత్రి విడదల రజనీ (vidadala rajini) పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా, ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న రజనీని ఇటీవల గుంటూరు పశ్చిమకు ఇన్‌ఛార్జ్‌ని చేసారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy).
నరసరావుపేట ఎంపీ స్థానానికి పోటీ చేస్తావా అని ఇటీవల జగన్ రజనీని పిలిచి అడిగారట. ఇందుకు ఆమె ససేమిరా అన్నారు. పోటీ చేస్తే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని… ఎంపీ స్థానం మాత్రం అస్సలు వద్దని తేల్చి చెప్పేసినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఒకవేళ ఇంత చెప్పినా ఎంపీ స్థానానికే పోటీ చేయమంటే మాత్రం ఇక చేసేదేమీ లేక పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది.