పుష్ప 2 రిలీజ్ కు మరికొంది రోజులు మాత్రేమీ మిగిలుంది. దాంతో రోజు రోజుకు ఈ పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చాలా పెద్ద లెవల్లో రెడీ అయ్యింది.
ఈ పై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయ్యింది.. ఆడియన్స్ కు కిక్ ఇచ్చేలా ఈ లో ప్రతి సన్నివేశాన్ని డిజైన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్ డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఇదిలా ఉంటే, 15-18 నిమిషాల జాతర సీక్వెన్స్ కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేశారని తెలుస్తోంది. పుష్ప 2 లో చాలా హైలైట్స్ ఉండనున్నాయి. మొదటి భాగానికంటే ఈసారి మరింత యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది.
‘పుష్ప 2’ బడ్జెట్ 500 కోట్లు అని అంటున్నారు. మొదటి భాగంతో పోలిస్తే ఈ చాలా గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడు కిల్లి క్రాంతి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. జాతర సీక్వెన్స్ కోసం రూ. 75 కోట్లు ఖర్చు చేసిన మేకర్స్, అసలు సీక్వెన్స్ కోసం 60 కోట్లు అలాగే రిహార్సల్స్ కోసం 14 కోట్లు ఖర్చు చేశారట. అలాగే అతను మాట్లాడుతూ.. ‘పుష్ప 2’ యొక్క జాతర సీక్వెన్స్ చిత్రానికి ప్రధాన హైలైట్ అవుతుందని చెప్పాడు. నిజానికి ఈ ఒక్క సీక్వెన్స్‌కి ఖర్చు చేసిన డబ్బుతో ఓ మీడియం రేంజ్ చెయ్యొచ్చు అని తెలిపాడు. ఈ సీక్వెన్స్ ని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలుపుతుందని అన్నాడు.
కాగా ఇప్పటికే జాతర సీక్వెన్ నుంచి పోస్టర్ ను అలాగే ఓ చిన్న వీడియో గ్లింమ్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అల్లు అర్జున్ ఇలా డిఫరెంట్ స్టైల్‌లో కనిపించడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ జనాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. పుష్ప 2 ట్రైలర్ నవంబర్ 17న రానుంది. దీని తర్వాత టీమ్ అంతా కలిసి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు. ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ ,వివిధ నగరాల్లో పర్యటించనుంది.