రూ. 10వేలలో రియల్‌మీ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ ఇలా ఉన్నాయి.

www.mannamweb.com


చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రియల్‌మీ సీ63 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ అమ్మకాలు ఈ నెల20వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.

ఫీచర్ల విషయానికొస్తే రియల్‌మీ సీ63 5జీ ఫోన్‌లో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో కూడిన 6.67 అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లేను ఇస్తున్నారు. 720×1604 పిక్సెల్స్ రిజల్యూషన్‌, 625 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఈ స్క్రీన్‌ను అందిచారు.

ధర విషయానికొస్తే ఫోన్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,999, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999గా నిర్ణయించారు. లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 10వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందిచారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.