ఒత్తిడిని తగ్గించే సబ్జా..
నల్లగా.. నువ్వుల్లా ఉండే సబ్జా గింజలు చేసే లాభాలు చాలా ఎక్కువే. బరువును తగ్గించడం నుంచి ఒత్తిడిని మాయం చేయడం వరకు వీటి వల్ల కలిగే ప్రయోజనాలు బోలెడు…
* సబ్జా విత్తనాల్లో విటమిన్ ఎ, ఇ మెండుగా ఉంటాయి. ఒమేగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా. ఈ విత్తనాలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.
* జీవక్రియలను మెరుగుపరుస్తాయి.
* బరువునే కాదు రక్తపోటునూ నియంత్రిస్తాయి.
* వీటిలోని పీచు మలబద్దకం సమస్యను నివారించడంతోపాటు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
* కడుపులో మంటను తగ్గిస్తాయి.
* జలుబు, దగ్గులను తగ్గించడంలో ముందుంటాయి.
* ఒత్తిడి, ఆందోళనలను నియంత్రించి గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
* రక్తాన్ని శుద్ధి చేస్తాయివి.
* ఈ విత్తనాలను నిమ్మ రసం, పండ్ల రసాలు, ఫ్రూట్ సలాడ్లు, మజ్జిగ, మిల్క్ షేక్స్‌లో కలిపి తీసుకుంటారు. వీటిని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.
* రాత్రంత నానబెట్టి ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. రోజంతా చురుగ్గా ఉంటారు. శారీరక శ్రమ చేసేవారు, క్రీడాకారులు వీటిని తమ ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది.
* ఈ గింజల్లో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇన్ని లాభాలున్న వీటిని తీసుకోవడం వెంటనే మొదలుపెట్టండి మరి.
ఈ గింజలను నీళ్లలో నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి. తలనొప్పిగా అనిపించినప్పుడు ఈ నీళ్లను తాగితే ఉపశమనంగా ఉంటుంది.