ఈమధ్య కాలం లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన ఘటన ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూస్తూనే ఉన్నాం.
దాడి చేసిన వారిలో ఒకరిని పట్టుకొని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బాంగ్లాదేశ్ కి చెందిన వాడని తెలుస్తుంది. అయితే పోలీసులు ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ భార్య, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ని కూడా అనుమానిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ కూడా అక్కడే ఉంది. అయితే ఆమె ఆ సమయంలో సైఫ్ ని కారులో తీసుకెళ్లకుండా, ఆటోలో ఎందుకు తీసుకెళ్లింది?, ఆ ఆటో లో కూడా ఆమె సైఫ్ తో కలిసి రాలేదు. తన 7 ఏళ్ళ కొడుకు సైఫ్ తో పాటు హాస్పిటల్ కి చేరుకున్నాడు. ఘటన జరిగిన రోజు తీరికగా కరీనా కపూర్ 11 గంటల సమయంలో హాస్పిటల్ కి చేరుకుంది.
భర్త పై అంత పెద్ద దాడి జరిగింది, ప్రాణాలతో బయటపడుతాడా లేదా అనే రేంజ్ టెన్షన్ అభిమానుల్లో ఉంది, అలాంటి టెన్షన్ కరీనా కపూర్ లో ఎందుకు లేదు అనేదే ఇప్పుడు అందరిలో మెలుగుతున్న ప్రశ్న. అంతే కాకుండా గదిలో నిందితుడు షరీఫుల్ ని దాడి సమయంలో బంధించారు. బంధించినప్పటికీ కూడా అతను ఆ గది నుండి తప్పించుకున్నాడు. ఇదెలా సాధ్యపడింది?, ఇంట్లో వాళ్ళు వదిలితే తప్ప, అతను బయటకి వెళ్లే స్కోప్ కూడా లేదు. ఈ కోణంలో కూడా పోలీసులు కరీనా కపూర్ ని అనుమానిస్తున్నారు. అంతే కాకుండా దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ పోలీసులకు చెప్పిన విషయాలకు, వాళ్ళ విచారణ లో బయటపడుతున్న విషయాలకు అసలు పొంతనే లేదని తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే కరీనా కపూర్ తన పని మనిషి తో కలిసి ఈ కుట్ర చేయించిందా అని అనుమానిస్తున్నారు.
దీంతో త్వరలోనే కరీనా కపూర్ ని పోలీసులు మరోసారి విచారించే అవకాశాలు ఉన్నాయి. సొంత భార్తపై హత్యాయత్నం చేయించేంత అవసరం కరీనా కపూర్ కి ఏమి ఉంటుంది?, ఎవరైనా ఇలా చేస్తారా?, సినిమాలను చూసి కొంతమంది కావాలని ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఆమె తీరు చూస్తుంటే అనుమానాలు కలిగిస్తున్నాయి. పోలీసులు అన్న తర్వాత అన్ని కోణాల్లోనూ కేసుని విచారిస్తారు. వాళ్ళ అనుమానాలకు తగ్గట్టుగా నిజానిజాలు తేలితే కరీనా కపూర్ దోషిగా అరెస్ట్ అవుతుంది, లేకపోతే తన నిజాయితీని నిరూపించుకుంటుంది. ఈ దాడి జరిగే కొద్ది గంటల క్రితమే ఆమె ఒక ప్రైవేట్ పార్టీ లో పాల్గొన్నట్టుగా సీసీటీవీ కెమెరాలో గమనించారు పోలీసులు. అసలు సైఫ్ ని ఆటో లో తీసుకెళ్లేంత దుస్థితి ఎందుకు వచ్చింది?, కారు ఏమైంది?, అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అనేది త్వరలోనే విచారణలో తేలనుంది.