రాజ్ నిడిమోరు తో సమంత డేటింగ్ రూమర్లు…ఈ తెలుగు డైరెక్టర్ ఆస్తుల విలువ తెలుసా.

ర్శకుడు రాజ్ నిడిమోరు తో కలిసి ఒక ఈవెంట్ లో పాల్గొనడానికి అమెరికా వెళ్ళింది సమంత. అక్కడ డైరెక్టర్ రాజ్ తో సమంత దిగిన కొన్ని ఫోటోలను స్పెషల్ గా సోషల్ మీడియా లో షేర్ చేసింది.


వాటిల్లో ఆమె రాజ్ తో చాలా క్లోజ్ గా ఉండటం, ఆమె అతని నడుముని పట్టుకుని ఉంటే ఆమె భుజం పై అతను చెయ్యివేసి నడుస్తున్న పిక్ ఒక్కసారి సోషల్ మీడియా ని కుదిపేసింది. అయితే సమంత నటించిన వెబ్ సిరీస్ ల దర్శకుడి గా మాత్రమే తెలిసిన రాజ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అతను ఎవరు అనే క్యూరియాసిటీ అందరిలో పెరిగిపోయింది..అతని గురించి తెలుసుకోవడానికి తెగ సెర్చ్ చేసేస్తున్నారు. అయితే రాజ్ నిడిమోరు గురించి మీకు తెలియని విషయాలు ఇవే….

రాజ్ నిడమోరు తెలుగోడే. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు బర్త్ ప్లేస్. అక్కడే చదువుకున్నాడు. అక్కడే SVU ఇంజనీరింగ్ కాలేజీలో చదువు పూర్తిచేసి అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్ళాడు. అక్కడ ఉన్నప్పుడే సినిమాలపై ఇంటరెస్ట్ మొదలయ్యింది. తనతోనే చిన్నప్పటినుండి కలిసి చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్న డీకే తో కలిసి ముందుగా ఒక షార్ట్ ఫిలిం చేసిన రాజ్, అతనితో కలిసే ఫ్లేవర్స్ అనే ఇంగ్లీష్ చిత్రాన్ని రూపొందించాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసే బాలీవుడ్ ప్రయాణం మొదలెట్టారు..డైరెక్టర్స్ ద్వయం గా పిలిచే వీరిద్దరూ కలిసే సినిమాలు రూపొందించారు. మూడు చిత్రం గో గోవా గాన్ తో పేరు సంపాదించిన వీరు, షోర్ ఇన్ ది సిటీ తో అంతర్జాతీయం గా పాపులర్ అయ్యారు.ఆ తరువాత కూడా మిత్రుడితో కలిసి కొన్ని చిత్రాలు చేసాక వెబ్ సిరీస్ లో అడుగుపెట్టి పెద్ద విజయాలు అందుకున్నారు. రాజ్ నిడమోరు ఫేవరెట్ దర్శకుడెవరో తెలుసా మన రామ్ గోపాల్ వర్మ.

రాజ్ ఆస్తుల విలువ తెలుసా..Dainik Jagran రిపోర్ట్ ప్రకారం దాదాపు 50 – 85 కోట్లు. సొంతంగా D2R అనే ఫిలిం ప్రొడక్షన్ కంపెనీని మిత్రుడు డీకే తో కలిసి ప్రారంభించాడు. ఈ బ్యానర్ కింద ఫ్యామిలీ మాన్, గన్స్ అండ్ గులబ్స్, సిటాడెల్ తదితర వెబ్ సిరీస్ లతో పాటు కొన్ని చిత్రాలు కూడా నిర్మించాడు. ఫ్యామిలీ మాన్ సిరీస్ కు సీజన్ కి 60 కోట్ల వరకు వీరికి అమెజాన్ పే చేసిందని టాక్. అదే కాకుండా వారి సొంత బ్యానర్ కు NETFLIX తో ఒప్పందం ఉంది. అలాగే స్తీ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే ఇచ్చినందుకు భారీగానే ఛార్జ్ చేసారని టాక్..ఇప్పటివరకు డైరెక్ట్ గా తెలుగు లో పెద్ద చిత్రాలు నిర్మించనప్పటికీ సినిమా బండి అనే OTT మూవీ ప్రొడ్యూస్ చేసారు రాజ్ అండ్ డీకే. నాని తో కలిసి డి ఫర్ దోపిడీ అనే ఒక ఫ్లాప్ చిత్రాన్ని కూడా నిర్మించారు.

సమంత డేటింగ్ వార్తల తరువాత వార్తల్లోకి వచ్చిన రాజ్ తన వ్యక్తిగత ఆస్తుల గురించి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటాడు. సమంత ఆస్తుల విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని ఒక అంచనా.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.