టీ20 ప్రపంచ కప్ 2026లో టీమ్ఇండియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి సూపర్-8 మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల టార్గెట్‌ని టీమ్ఇండియా 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజు శాంసన్ (97*; 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ (27), సూర్యకుమార్ యాదవ్ (18), హార్దిక్ పాండ్య (17), అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10) పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్ 2, జేసన్ హోల్డర్ 2, అకీల్ హోస్సేన్ ఒక వికెట్ పడగొట్టారు. వాంఖడేలో మార్చి 5న రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (40), జాసన్ హోల్డర్ (37*), రోవ్‌మన్ పావెల్ (34*), షై హోప్ (32), షిమ్రోన్ హెట్‌మయెర్ (27), షెర్ఫానె రూథర్‌ఫోర్డ్ (14) దూకుడుగానే బ్యాటింగ్ చేశారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 2.. హార్దిక్, వరుణ్ తలో వికెట్ తీశారు.


































