Saving Schemes: అమేజింగ్ స్కీమ్.. భార్యాభర్తలకు 5 ఏళ్లలో రూ.25 లక్షలు!

www.mannamweb.com


Small Saving Schemes | కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది.
పోస్టాఫీస్ లేదంటే బ్యాంకుల్లో ఈ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారు ఈ పథకాల్లో చేరొచ్చు. కచ్చితమైన లాభం సొంతం చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల్లో స్కీమ్స్‌లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకం చేరడం వల్ల అదిరే రాబడి పొందొచ్చు. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అన్నింటిలో కెల్లా ఇందులోనే మీకు అధిక వడ్డీ లభిస్తుంది.

మోదీ సర్కార్ ఇటీవలనే స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు పెంచేసింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై కూడా వడ్డీ రేటు పైకి చేరింది. ఏప్రిల్ 1 నుంచి వడ్డీ రేటు పెంపు అమలులోకి వచ్చింది.

ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 8.2 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. అంటే మీరు డబ్బులు డిపాజిట్ చేస్తే.. ఐదేళ్ల వరకు విత్‌డ్రా చేసుకోవడానికి వీలు ఉండదు. మెచ్యూరిటీ సమయంలో వడ్డీ, అసలు రెండు కలిపి పొందొచ్చు.
పోస్టాఫీస్‌ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్స్‌లో చేరాలని భావించే వారికి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ కూడా అందించింది. డిపాజిట్ మొత్తం లిమిట్‌ను పెంచేసింది. డబుల్ చేసింది. అంటే ఇప్పుడు రెట్టింపు డబ్బును దాచుకోవచ్చు.
ఇది వరకు ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ. 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని రూ. 30 లక్షలకు పెంచారు. అంటే సీనియర్ సిటిజన్స్‌ రూ. 30 లక్షల వరకు డబ్బులు దాచుకునే ఛాన్స్ ఉంటుంది.

ఉదాహరణకు మీరు ఈ స్కీమ్‌లో రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే.. ఐదేళ్ల కాలంలో 8.2 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 42.3 లక్షలు లభిస్తాయి. అంటే మీకు వడ్డీ రూపంలోనే రూ. 12 లక్షలకు పైగా వచ్చాయని చెప్పుకోవచ్చు.

వడ్డీ డబ్బులు త్రైమాసికం చొప్పున చెల్లిస్తారు. అంటే మీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 61,500 వస్తాయి. వార్షికంగా వడ్డీ రూపంలోనే మీరు రూ. 2.46 లక్షలు పొందొచ్చు. మార్చి 31 వరకు చూస్తే అప్పుడు 8 శాతం వడ్డీ ఉండేది.

అదే ఇంట్లో భార్యభర్తలు ఇద్దరూ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో చేరితే అప్పుడు ఇద్దరికీ రూ. 12.3 లక్షలు వస్తాయి. అంటే ఇద్దరికీ కలిపి రూ. 25 లక్షల వరకు వస్తాయని చెప్పుకోవచ్చు.

అంతేకాకుండా మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్‌లో చేరడం వల్ల రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. 60 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు.