Kanakadurgamma: విజయవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడక వెనకున్న రహస్యం ఏంటో తెలుసా..? అమ్మవారి ముక్కుపుడకకు కలియుగం అంతానికి లింకు ఉందని పండితులు చెప్తుంటారు. ముక్కుపుడకను అందుకోవడానికి కృష్ణానది నీళ్లు దుర్గమ్మ సన్నిధికి చేరుకుంటాయని అంటుంటారు. అసలు ముక్కుపుడక ఉన్న కహానీ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
దుర్గమ్మ ముక్కుపుడకకు.. కృష్ణమ్మ ఉగ్రరూపానికి లింకు ఉందని పండితులు చెప్తుంటారు. అది కూడా దుర్గమ్మ, కృష్ణమ్మ మధ్య జరిగిన ఒప్పందం అంటుంటారు. ఆ ఒప్పందం ఏంటి దుర్గమ్మ ముక్కుపుడకకు కృష్ణమ్మకు ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాలి.
కృష్ణమ్మకు అడ్డుపడిన ఇద్రకీలాద్రి:
ఒకప్పుడు కృష్ణమ్మ భూమి మొత్తం నీరు పారాలి అనే ఆజ్జతో భూమి చుట్టూ ప్రవహిస్తూ ఉంటుందట. అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ బెడవాడ దగ్గరకు వస్తుందట. సముద్రంలో కలసేందుకు వెళ్తున్న కృష్ణవేణి నదికి అడ్డుగా ఇంద్రకీలాద్రి పర్వతం ఎదురవుతుందట. అప్పుడు కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రి ముందు నిలబడి చేతులు జోడించి మనఃస్పూర్తిగా వేడుకుంటుందట. ‘నాకు దారి ఇవ్వు నేను నా గమ్యాన్ని చేరాలి’ అని అడగ్గానే అప్పుడు ఇద్రకీలాద్రి ‘నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాను. నా భక్తికి మెచ్చి దుర్గమ్మ నా మీదే కొలువై ఉంది. ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే.. నువ్వు ఈ ఇంద్రకీలాద్రిని ఏం చేస్తావో నాకు తెలుసు’ అంటుందట.
కృష్ణమ్మకు వరమిచ్చిన దుర్గమ్మ:
అప్పుడు కృష్ణమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ రెండు చేతులు జోడించి కొండపైన ఉన్న కనకదుర్గమ్మను ప్రార్థిస్తుందట. కృష్ణమ్మ భక్తికి మెచ్చిన కనకదుర్గమ్మ కరుణించి ఇలా అంటుందట. ‘కృష్ణవేణి నువ్వు అనుకున్నది జరుగుతుంది కానీ నీ దగ్గర నుంచి నాకు ఒకటి కావాలి’ అని అడగ్గానే.. వెంటనే కృష్ణవేణి సరే ఇస్తాను అమ్మ ఏది కావాలో చెప్పు అని కనకదుర్గమ్మను అడుగుతుంది. దీంతో దుర్గమ్మ నవ్వుతూ నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమీ చేయకుండా ఇంద్రకీలాద్రికి ఉన్న బెజ్జం గుండా ప్రవహించు అని చెప్తుందట. దుర్గమ్మ మాటలకు సంతోషించిన కృష్ణవేణి నాకు దారి చూపావు మాత కానీ మీకు నా దగ్గర నుంచి ఏం కావాలో చెప్పలేదు అని అడుగుతుందట. దీంతో దుర్గమ్మ నవ్వుతూ నాకు నీ ముక్కుపుడక చాలా నచ్చింది. దాన్ని నాకు అరువుగా ఇస్తావా..? అని అడుగుతుందట. దీంతో కృష్ణవేణమ్మ కూడా సంతోషంగా సరే అంటూ తన ముక్కుపుడకను తీసి కనకదుర్గమ్మకు అరువుగా ఇస్తుందట.
కలియుగాంతంలో ముక్కుపుడక తీసుకుంటానన్న కృష్ణమ్మ:
ఈ కలియుగం అంతం అయ్యే సమయంలో నేనే కొండ మీదకు ఎగసి నా ముక్కుపుడకను తిరిగి తీసుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రికి ఉన్న బెజ్జం ద్వారా కృష్ణవేణమ్మ ప్రవహించి సముద్రంలో కలిసిపోతుందట. అప్పటి నుంచి ఆ బెజ్జం వాడగా పిలవబడిన ప్రదేశం కాలక్రమేణా బెజవాడగా తర్వాత ఇప్పటి విజయవాడగా మారింది. ఎప్పుడైతే కృష్ణా నది నీళ్తు నిజంగా అమ్మవారి ముక్కుపుడకను తాకుతాయో అప్పుడు ఈ ప్రపంచానికి ప్రళయం వస్తుంది. అప్పుడు కలియుగం అంతం అవుతుందని పెద్దలు నమ్ముతారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.



































