వారసత్వ భూములకు సెక్షన్‌ సర్టిఫికెట్‌: సీఎం చంద్రబాబు

వారసత్వ భూములకు సెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రెవెన్యూ శాఖపై సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.10లక్షల వరకు విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో రూ.100 చెల్లించి సెక్షన్‌ సర్టిఫికెట్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు.


రూ. 10లక్షలు దాటిన భూములకు రూ.వెయ్యి చెల్లించి సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలను ఆగస్టు 2లోగా మంజూరు చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. మెజార్టీ రెవెన్యూ సమస్యలను అక్టోబరు 2లోగా పరిష్కరించాలని సూచించారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.