ఈ వారం ఓటీటీలో,థియేటర్స్ లో విడుదయ్యే సీరిస్ లు,సినిమాలు

 వారం OTT ప్లాట్‌ఫార్మ్స్ పూర్తి సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి! థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నా, ఇంట్లోనే ఎంజాయ్ చేసే వారికి టాప్ స్టఫ్ రాబోతోంది.


‘OG’, ‘Dude’, ‘Family Man 3’ తర్వాత వారం వారం నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్!

ఇక ఈ వారం మీ స్క్రీన్ మీద ఏం పేలబోతోందో చూద్దాం…

STRANGER THINGS S5 – ప్రపంచం ఎదురు చూసిన సీజన్!

Netflix | Nov 26

అభిమానులు ఏళ్లుగా ఎదురుచూసిన Stranger Things 5 ఫైనల్ బ్లాస్ట్ వచ్చేసింది! Hawkins మళ్లీ ప్రమాదంలో… కానీ ఈసారి రిస్క్ రెట్టింపుతో అలరించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్నంటాయి.

Sunny Sanskari Ki Tulsi Kumari – ఫన్, డ్రామా, గ్లామర్ డబుల్ డోస్!

Netflix | Nov 27

వరుణ్ ధవన్ – జాన్వీ కపూర్ జంట ఈసారి ప్యూర్ ఫ్యామిలీ-ఎంటర్‌టైన్‌మెంట్ సర్వ్ చేయబోతుంది. రొమాంటిక్ డ్రామా, లైట్ కామెడీ ఈ మూవీ USP!

AARYAN – రైటర్ ప్లాన్ చేసిన పర్‌ఫెక్ట్ క్రైమ్!

Netflix | Nov 28

విష్ణు విశాల్ హీరోగా వచ్చిన ఈ థ్రిల్లర్‌లో టెన్షన్ లెవెల్ పీక్‌కు. “ఇదే సరైన క్రైమ్ అవుతుంది” అని ప్రకటించిన రైటర్… అతన్ని ఆపగలరా? పోలీసులకు టైమ్ లేదు అన్న ఎలిమెంట్ తో దిగుతోంది!

Troll 2 – ‘సడెన్ హిట్’ కి సీక్వెల్ రెడీ!

Netflix | Dec 1

Troll అనూహ్యంగా బిగ్ హిట్ అయ్యాక… సీక్వెల్‌పై అంచనాలు భారీ. ఈసారి మరింత పెద్ద స్కేల్‌లో మాన్‍స్టర్ గా మన ముందుకు!

Wondla S3 – భూమి మీద Eva సాహసాలు!

Apple TV+ | Nov 26

అండర్‌గ్రౌండ్ నుంచి బయటికి వచ్చిన Eva… విచిత్రమైన ప్రపంచాన్ని చూసి షాక్! హ్యూమానిటీకి నిజంగా ఏం జరిగింది? అనే పాయింట్ తో రాబోతోంది.

థియేటర్లలో కూడా హడావుడి ఇదిగో…

రామ్ పోతినేని – “ఆంధ్ర కింగ్ తాలూకా” ఈ వీక్‌ సినిమా లిస్ట్‌లో టాప్ అటెన్షన్ ఇదే.

కీర్తి సురేశ్ – “రివాల్వర్ రీటా” స్టైలిష్, క్రేజీ ట్రీట్ కోసం చూస్తున్నారా? ఇదే!

ధనుష్ – “అమర కావ్యం” క్లాసీ టచ్ ఉన్న ఎమోషనల్ సబ్జెక్ట్.

ఇంకా: అంధక, ఖైదు, స్కూల్ లైఫ్, మరువ తరమా… చిన్న సినిమాలు కూడా గుడ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

అవన్నీ ఇలా ఉన్నా ఈ వారం రానున్న వాటిల్లో రవితేజ నటించిన మాస్ జాతర, తమిళ హీరో విష్ణు విశాల్ నటించిన ఆర్యన్‌, అనుపమ పరమేవ్వరన్ నటించిన మలయాళ చిత్రం పెట్ డిటెక్టివ్, ఇంగ్లీష్ సిరీస్ స్టేంజర్ థింగ్స్ ఫైనల్ సీజన్ పార్ట్‌1 తెలుగు ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇవ్వనున్నాయి.

ఏ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేసినా ఫ్రెష్ కంటెంట్ రెడీగా ఉంది. నవంబర్ నాలుగో వారం ఎంటర్టైన్‌మెంట్ పరంగా లిటరల్లీ బాంబే

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.