ఆమెకు 54.. ఆయనకు 52.. లేటు వయసులో ప్రేమ పెళ్లి!

సాధారణంగా సినిమాల్లో హీరో, హీరోయిన్లు పలు కారణాల వల్ల వయసు దాటే వరకు పెళ్లి చేసుకోరు. కానీ ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. సినిమా ఎండ్ కార్డు పడే సమయానికి తమ పిల్లల సమక్షంలో వివాహబంధంలోకి అడుగు పెడుతుంటారు.


ఇది సినిమాల్లో చూస్తే చాలా ఎమోషన్ గా ఫీల్ అవుతాం. అయితే ఇలాంటి సీన్ నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అవును అచ్చం అలాంటి సీన్ తుమకూరు జిల్లా గుబ్బి లో జరిగింది. స్వచ్ఛమైన ప్రేమకు ఈ జంట ఉదాహారణ అంటున్నారు. ఈ జంటది ఎంతో గొప్ప ప్రేమ పెళ్లి అని అక్కడ జనాలు కొనియాడుతున్నారు. ఇంతకీ ఆ ప్రేమ జంట ఎవరు.. ఎందుకు లేటు వయసులో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

తుమకూరు జిల్లా గుబ్బిలో ప్రేమ జంట పెళ్లి చేసుకున్నారు.. ఇందులో పెద్ద విశేషం ఏముందీ అని మీకు అనుమానం రావొచ్చు. ఆ ప్రేమ జంట యుక్త వయసులో కాదు.. చాలా లేటు వయసులో పెళ్లి చేసుకున్నారు. తరికేరె సమీపంలో అమృత్ పూర్ లోని అమృతేశ్వర స్వామి ఆలయంలో సుధ (54), మోహన్ కుమార్ (52) ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ మైసూర్ లోని అబ్దుల్ నజీర్ సాబ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయత్ రాజ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో ఉద్యోగులు. ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చే రిసోర్స్ లో ట్రైనర్లు గా జాబ్ చేస్తున్నారు. మోహన్ కుమార్ బ్రహ్మణులు.. సుధ మరాఠీ కి చెందిన మహిళ.

వయసులో ఉన్పపుడు వీరిద్దరూ కమ్యూనిస్టుల భావజాలానికి ఆకర్షితులై సీపీఎం లో చేరారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల్లో పాల్గొన్నారు. 90వ దశకంలో బికె సుందరే కి ఇద్దరూ ఇష్టమైన శిష్యులు. అదే సమయంలో మోహన్, సుధ ల మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరి అన్యోన్యత చూసి సహ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు మీరు భార్యాభర్తలు అయితే అందరికీ ఆనందంగా ఉంటుందని చెప్పేవారు. అలా వీరి మధ్య 25 ఏళ్లు ప్రేమ కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ప్రతినిధులు, సన్నిహితుల చొరవతో ఎంతో నిరాడంబరంగా సుధ మెడలో మోహన్ కుమార్ తాళి కట్టాడు. ఈ జంటను బంధుమిత్రులు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు.