స్మృతి పెళ్లి ఆగిపోయింది.. చీటింగ్ స్టోరీ బయటపడింది..

స్మృతి మందాన పెళ్లి వాయిదా పడింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో నవంబర్ 23న జరగాల్సిన మ్యారేజ్.. అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది.


ముందుగా స్మృతి ఫాదర్‌కు గుండెపోటు వచ్చిందని.. అందుకే పెళ్లి వాయిదా పడిందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పెళ్లి కొడుకు కూడా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడని తెలిసింది. కానీ ఈ వార్త తర్వాత స్మృతి తన వివాహానికి సంబంధించిన వీడియోలన్నింటినీ సోషల్ మీడియాలో డిలీట్ చేయడం.. పెళ్లి ఆగేందుకు ఇంతకు మించిన బలమైన కారణం ఉందనే అనుమానం కలిగించింది.

ఈ అనుమానాలను బలపరుస్తూ సోషల్ మీడియాలో కొత్తగా ఓ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. నిజానికి ఈ పెళ్లికి ఒక్క రోజు ముందు రాత్రి పలాష్.. ఓ కొరియోగ్రాఫర్‌తో కలిసి స్మృతిని చీట్ చేశాడని తెలుస్తోంది. అతను పెళ్లి నుంచి పారిపోయాడని.. దీన్ని కవర్ చేసేందుకే హాస్పిటల్ డ్రామా నడుస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ కారణంగానే స్మృతి ఫొటోలు, వీడియోలు డిలీట్ చేసిందనేది చర్చ.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.