మాజీ ప్రియుడితో కలిసేందుకు చేతబడి చేయించిన ప్రియురాలు.. చివరికి భారీ ట్విస్ట్

www.mannamweb.com


విడిపోయిన తన మాజీ ప్రియుడితో మళ్లీ కలిసేందుకు ఓ యువతి చెతబడి చేయించింది. ఈ విచిత్ర సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరుకు చెందిన ఓ ముస్లిం యువతి తన మాజీ ప్రియుడితో గొడవపడి విడిపోయింది. అయితే అతను లేకుండా ఉండలేకపోయిన ఆమె అతన్ని తిరిగి పొందేందుకు తన స్నేహితులైన అబ్దుల్, లియాఖతుల్లాతో కలిసి ఇంటర్నెట్ ద్వారా ఓ జ్యోతిష్కుడిని సంప్రదించారు. తన మాజీ ప్రియుడితో తనను కలపాలని చెప్పారు. దీనికి ఆ మంత్రగాడు.. కొన్ని ఆచార పద్దతులను పాటించాలని అందుకు మొదట రూ. 501 రూపాయలు చెల్లించాలని తెలిపాడు. దీంతో ఆ యువతి ఆన్ లైన్‌లో అతనికి డబ్బులు పంపింది.

అనంతరం మంత్రగాడు ఆమె మాజీ ప్రియుడు, తల్లిదండ్రులపై చేతబడి కర్మలు చేయాల్సి ఉందని.. దానికి ఆమె ప్రేముకుడితో ఉన్న ఫొటోలు, అలాగే యువకుడి తల్లిదండ్రుల ఫొటోలతో పంపాలని.. ఈ కార్యానికి 2.4 లక్షలు ఖర్చు అవుతాయని తెలిపి.. ఆ డబ్బును తిరిగి చెల్లిస్తానని మంత్రగాడు యువతికి తెలిపాడు. దీంతో ఆమె అతనికి నగదు బదిలీ చేసింది.
మరికొన్ని రోజుల తర్వాత అదనంగా రూ. 1.7 లక్షలు పంపమనడంతో యువతి పంపింది. అయితే ఎంతకీ యువతి చెప్పిన పని కాకపోవడంతో అనుమానం వచ్చి మంత్రగాడిని నిలదీసింది. దీంతో అతను ప్లేట్ మార్చేసి యువతిని బెదిరించడం మొదలు పెట్టాడు. తన బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోలు యువతి తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.

దీంతో యువతి అతని బెదిరింపులకులోనై భయంతో మరికొన్ని డబ్బులు మంత్రగాడు చెప్పిన ఖాతాకు పంపింది. అయినప్పటికీ మంత్రగాడి నుంచి ఆర్థిక వేధింపులు తగ్గలేదు. దీంతో యువతి తాను మోసపోయిన సంగతి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకు యువతి మొత్తం 8.2 లక్షలు మోసపోయినట్టు గుర్తించారు. అలాగే యువతి నగదు బదిలీ చేసిన అకౌంట్ మంత్రగాడి సహచరుడు లియాఖతుల్లా అకౌంట్ గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా.. మొబైల్ నెంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయబడింది. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.