తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మంది మరణించగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
22 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కసలాట జరిగిన వెంటనే విజయ్ అర్థంతరంగా తన ప్రసంగాన్ని ముగించివేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


































