సత్తు పిండి గురించి ఈ తరానికి తెలియదుగానీ.. మన అమ్మమ్మలు, నానమ్మలకు దీన్ని తయారు చేయడంలో స్పెషలిస్టులు. నోటికి రుచిగా ఉండటమేకాదు. ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.
సత్తు పిండిని శనగలతోపాటు ఇతర పప్పులు, బెల్లంతో తయారు చేస్తారు. దీన్ని డ్రై రోస్టింగ్ పద్ధతిలో తయారు చేయడం వల్ల ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
100 గ్రాముల సత్తు పిండి తింటే 20.6 శాతం ప్రొటీన్లు, 7.2 శాతం కొవ్వు, 1.35 శాతం పీచు, 65.2 శాతం కార్బోహైడ్రేట్లు, 2.7 శాతం పొట్టు, 406 కేలరీలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతటి పోషకాలు కలిగిన సత్తు పిండిని నిత్యం తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇది చాలా మంచిది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. మలబద్ధకం, కడుపు వ్యాధులకు చాలా మంచి ఔషధం. సత్తు పిండి ఫైబర్‌తో నిండి ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్‌ను తగ్గించడం నుంచి రక్తపోటును నియంత్రించడం వరకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే.. సత్తు పిండితో చేసిన షర్బత్‌ను క్రమం తప్పకుండా తాగితే గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సత్తు పిండిలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు సత్తు పిండిని తినాలని వైద్యులు సూచిస్తున్నారు.మంచి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. సత్తు పిండిలో ఉండే వివిధ విటమిన్లు, మినరల్స్ కారణంగా ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సత్తు పిండి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ కాంతి మెరుగుపడుతుంది. అంతే కాకుండా జుట్టుకు పోషణ అందిస్తుంది.
సత్తు పిండి బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే, మీరు రోజువారీ ఆహారంలో దీనిని తీసుకోవచ్చు. సత్తు పిండిలోని పీచుపదార్థం చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది.