తెలంగాణ స్పెషల్ “బగారా రైస్”..రుచిగా ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..

తెలంగాణలో ఏ ఫంక్షన్ అయినా సరే, బగారా రైస్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అది పెళ్లి, చావు, బర్త్‌డే లేదా ఏ ఉత్సవమైనా, బగారా రైస్ లేనిదే తెలంగాణలో ఫంక్షన్ అసంపూర్ణం.


దేశంలోని ఇతర ప్రాంతాల్లో లేని విధంగా తెలంగాణ బగారా బువ్వ రుచి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన తెలంగాణ స్టైల్ బగారా రైస్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

బగారా రైస్ తయారీకి కావలసిన పదార్థాలు
– నూనె: 2 టేబుల్ స్పూన్లు
– నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
– షాజీరా: 1 టేబుల్ స్పూన్
– దాల్చిన చెక్క: 2 ఇంచులు
– స్టార్ అనాస: 1
– నల్ల యాలకులు: 1
– పచ్చి యాలకులు: 5-6
– బిర్యానీ ఆకులు: 2
– నల్ల మిరియాలు: కొద్దిగా
– జాపత్రి: కొద్దిగా
– పచ్చిమిర్చి: 2
– ఉల్లిపాయ: 1
– అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
– నానబెట్టిన బాస్మతి బియ్యం: 2 కప్పులు
– పుదీనా: కొద్దిగా
– ఉప్పు: తగినంత
– వేడి నీరు: 2.5 కప్పులు
– కొత్తిమీర: కొద్దిగా
– లవంగాలు: 5-6

బగారా రైస్ తయారీ విధానం
1. ముందుగా కుక్కర్‌ను స్టవ్‌పై పెట్టి, నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి.
2. అందులో షాజీరా, దాల్చిన చెక్క, స్టార్ అనాస, నల్ల యాలకులు, పచ్చి యాలకులు, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు, జాపత్రి, లవంగాలు వేసి వేయించాలి.
3. తర్వాత ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి, ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.
4. నానబెట్టిన 2 కప్పుల బాస్మతి బియ్యం, కొత్తిమీర, పుదీనా (కొంచెం ఎక్కువగా) వేసి, నెమ్మదిగా 2 నిమిషాలు వేయించాలి.
5. ఆ తర్వాత, 1 కప్పు బియ్యానికి 1.25 కప్పుల నీటి నిష్పత్తిలో వేడి నీరు పోసి, కుక్కర్ మూత పెట్టి, హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ రానివ్వాలి.
6. స్టీమ్ పూర్తిగా ఆవిరైపోయే వరకు వేచి, తర్వాత ప్లేట్‌లో వడ్డించుకొని ఆస్వాదిస్తే స్వర్గమే!

బగారా రైస్ ప్రయోజనాలు
బగారా రైస్ రుచికరమే కాదు, ఆరోగ్యకరమైనది కూడా. ఇందులో వాడే బాస్మతి బియ్యం తేలికగా జీర్ణమవుతుంది మరియు మంచి కార్బోహైడ్రేట్ల మూలం. దీని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బగారా బువ్వలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు కొన్ని మసాలాలు గుండె ఆరోగ్యాన్ని, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

గమనించవలసినవి
– బగారా రైస్ లో నెయ్యి లేదా నూనె అధికంగా ఉపయోగిస్తే కేలరీలు, కొవ్వు శాతం పెరుగుతుంది.
– ఎక్కువ ఉప్పు వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు.
– సమతుల్య ఆహారంలో భాగంగా దీనిని మితంగా తీసుకోవడం ఉత్తమం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.