గోల్‌ అంటే ఇలా ఉండాలి.! పక్క ప్లానింగ్ తో ఈసారి బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే

www.mannamweb.com


గోల్‌ అంటే ఎలా ఉండాలి? రాత్రింబవళ్లు అదొక్కటే ఆలోచనతో ఉండాలి. దాన్ని రీచ్‌ అయ్యేవరకు అసలు ఇంకో ధ్యాసలేనట్టు పనిచేయాలి. ఎన్ని పనుల మధ్య ఉన్నా.. ఫుల్‌ ఫోకస్‌ మాత్రం లక్ష్యం మీదే ఉండాలి. ఇప్పుడు అలాంటి లక్ష్యంతోనే పనిచేస్తున్నారు మెగాస్టార్‌. సంక్రాంతికి ధమాకా సక్సెస్‌ చూడాలన్నదే ఇప్పుడు ఆయన ధ్యేయం.. పూనకాలు లోడింగ్‌ అంటూ లాస్ట్ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్‌ చిరంజీవి చేసిన సందడి ఇంకా ఫ్యాన్స్ చెవుల్లో మారుమోగుతూనే ఉంది.

ముగ్గుల పండక్కి మస్త్ సినిమా ఇచ్చారు బాస్‌ అని పొంగిపోయారు ఫ్యాన్స్. కానీ ఆ తర్వాత రిలీజ్‌ అయిన భోళా శంకర్‌ మాత్రం బొమ్మను తిప్పేసింది.

భోళా శంకర్‌ సినిమా వచ్చిందనే విషయాన్ని మరిపింప జేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు మెగాస్టార్‌. బింబిసారతో సూపర్‌డూపర్‌ సక్సెస్‌ అయిన వశిష్టకు సెకండ్‌ సినిమా ఛాన్స్ ఇచ్చేసి,

సంక్రాంతికి వచ్చేయడానికి సర్వం సిద్ధం చేసుకోమన్నారు. ఆ పనులు చకాచకా జరుగుతున్నాయిప్పుడు. విశ్వంభర కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఫైనల్‌ షూటింగ్‌ జరుగుతోంది. మరోవైపు మెగాస్టార్‌ పోర్షన్‌కి డబ్బింగ్‌ కూడా మొదలైంది. మైక్‌ పట్టుకుని డైలాగులు చెప్పేస్తున్నారు మెగాబాస్‌. రేపోమాపో సెప్టెంబర్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం.

ఇంకెంతసేపు.. అలా చూస్తూ ఉండండి.. ఇలా సంక్రాంతికి కలుసుకుందాం అనే హింట్స్ అందుతున్నాయి మెగా ఫ్యాన్స్ కి. బాసూ వేర్‌ ఈజ్‌ ద పార్టీ అంటూ పాడేసుకుంటున్నారు మెగాసైన్యం.