పెళ్లి చేసుకున్న కుంభమేళా సుందరి

మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష దండలు అమ్ముతూ, తన ఆకర్షణీయమైన కళ్లతో రాత్రికి రాత్రే సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారిన మోనాలిసా భోస్లే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బుధవారం కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అరుమనూర్‌ ఆలయంలో తన ప్రియుడు ఫర్మాన్‌ఖాన్‌ను ఆమె మనువాడా రు. ఈ వివాహ వేడుకకు కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్‌ కుట్టి తదితర రాజకీయ నేతలు హాజరయ్యారు. కేరళ సంప్రదాయం ప్రకారం వరుడు ఫర్మాన్‌ ముండు(ధోవతి) ధరించగా, మోనాలిసా ఎరుపు రంగు పట్టుచీరలో మెరిసిపోయారు. వివాహం అనంతరం మీడియాతో మోనాలిసా మాట్లాడుతూ.. తనకు కేరళ అంటే చాలాఇష్టమని, అందుకే ఇక్కడ పెళ్లి చేసుకున్నానని తెలిపారు. ‘‘నేనూ ఒకనటుడినే. మాది 6 నెలల ప్రేమకథే కావొచ్చు, కానీ అది అరవై ఏళ్ల బంధంలా అనిపిస్తోంది’’అని ఆమె భర్త ఫర్మాన్‌ అన్నారు. పెళ్లికి ముందు ఈ జంట రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. మోనాలిసా తండ్రి విజయ్‌ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు.