ఏపికి వానల ముప్పు వీడలేదు. ఇప్పటికే.. భారీ వర్షాలకు పలు కాలవలు, చెరువులకు గండ్లు పడ్డాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ క్రమంలో మరో పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ.
పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వేరొక అల్పపీడనం సెప్టెంబర్ 5, 2024 నాటికి ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో.. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————————
మంగళవారం, బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .
గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-
————————————–
మంగళవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము అనేక చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .
బుధవారం, గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది
రాయలసీమ :-
—————————————
మంగళవారం, బుధవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .
గురువారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .